26.7 C
Hyderabad
September 20, 2026
పశ్చిమగోదావరిహోమ్

విద్యుత్ సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి సిద్ధం

#Eluru

ఏలూరు జిల్లాలో ప్రస్తుత వేసవి వల్ల పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని , ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఏ పి ఈ పి డి సి ఎల్ ఎస్ ఈ పి సాల్మన్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ఏలూరు జిల్లాలోని అన్ని మండలాల్లో రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు 41 నుండి 50 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, జిల్లా కలెక్టర్  కె. వెట్రిసిల్వి, ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ఐ.పృద్వీలేజ్ ఆదేశాల మేరకు విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అహర్నిశలు అప్రమత్తతతో విధులు నిర్వహిస్తున్నారన్నారు.

వేసవి తీవ్రత, వడగాల్పుల ప్రభావం దృష్ట్యా వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిరంతరాయంగా మరియు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చేపట్టిన ముఖ్యమైన చర్యలుతెలియజేస్తూ అధిక విద్యుత్ లోడ్ నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు (DTRలు) ఏర్పాటు చేయడం జరిగిందని, ఓవర్ లోడ్ కు  గురవుతున్న పాత ట్రాన్స్ పార్కర్ల సామర్థ్యాన్ని పెంచి విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.

గరిష్ట విద్యుత్ వినియోగ సమయాల్లో (Peak Load llours) తలెత్తే సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు సర్కిల్ పరిధిలోని 19 మండలాల్లో ప్రతి మండలానికి మూడు చొప్పున ప్రత్యేక అత్యవసర బృందాలు (Emergency Barnches) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

విద్యుత్ సరఫరా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించేందుకు అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించబడ్డాయని,  వీరు షిఫ్ట్ ల వారిగా పనిచేస్తూ లోడ్ హెచ్చుతగ్గులను గమనించి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నారన్నారు.

ప్రతి   డివిజన్ పరిధిలో తగినన్ని రోలింగ్ స్టాక్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు సిద్ధంగా ఉంచడం జరిగిందన్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా వ్యాప్తంగా సుమారు 400 విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు (DTRలు) స్టాక్ అందుబాటులో ఉంచడం జరిగిందని చెప్పారు,

ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి విద్యుత్ అంతరాలయలకు సంబందించిన ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. వినియోగదారులు విద్యుత్ సంబంధిత సమస్యలు ఎదురైన వెంటనే క్రింది నంబర్లకు సమాచారం అందించాలని కోరారు:

పర్యవేక్షక ఇంజనీర్, ఏలూరు: 9440812702

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జంగారెడ్డిగూడెం: 9491049797

ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు: 9440812704

విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912

లోడ్ మోనిటరింగ్ సెల్స్

బంగారెడ్డిగూడెం డివిజన్ : 9491030712

ఏలూరు డివిజన్: 9440904037

ఏలూరు సర్కిల్ : 9440902926

సమాచారం అందిన వెంటనే సమస్యల పరిష్కారానికి విద్యుత్ శాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటారని తెలిపారు. వేసవి కాలంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణాలు, గ్రామాల్లో అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేయడం, లోడ్ బ్యాలెన్సింగ్ చర్యలు చేపట్టడం జరుగుతోందని, వినియోగదారులకు నాణ్యమైన మరియు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు విద్యుత్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని  సాల్మన్ రాజు తెలియజేసారు.

Related posts

విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో భారీ ట్రాఫిక్‌ జామ్‌

Satyam News

విజయవంతంగా నీట్ (యూజీ)–2026 పునఃపరీక్ష

Satyam News

ఉత్సాహంగా గ్రూప్ వన్ ట్రైనింగ్ అధికారుల సైక్లాథాన్

Satyam News

రేవంత్ రెడ్డిది ‘మిషన్ మోడ్’ కాదు.. ‘కమీషన్ మోడ్’

Satyam News

మిడ్‌మానేరు ఎడమ కాలువ పనులు పునఃప్రారంభం

Satyam News

ఎల్లంపల్లి నీళ్లకు కాళేశ్వరం నీళ్లుగా ప్రచారం

Satyam News

Leave a Comment