26.3 C
Hyderabad
September 19, 2026
సంపాదకీయంహోమ్

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

#YSJagan

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ శవ రాజకీయాలకు కేరాఫ్‌ ఆఫ్ అడ్రస్ అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. సొంత తండ్రి, బాబాయ్‌ చావులను నిచ్చెన మెట్లుగా చేసుకొని.. సాధారణ ఎంపీ స్థాయి నుంచి సొంత పార్టీ పెట్టుకొని.. ముఖ్యమంత్రి సీటులో కూర్చొనే రేంజ్‌కి ఎదిగారు.

ఇప్పుడు సొంత ఫ్యామిలీలో శవాలు దొరకడం లేదో ఏమో గానీ.. మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చావు గురించే మాట్లాడుతున్నారు. తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎప్పుడు పోతాడా అని గోతి కాడ నక్కలా కాచుకొని కూర్చున్నట్లు.. జగన్‌ చేస్తున్న కామెంట్స్‌తో రాష్ట్ర ప్రజలంతా ఆయన్ని అసహ్యించుకొనే పరిస్థితి కనిపిస్తోంది.

పిచ్చి ముదిరి తలకు రోకలి చుట్టుకున్న వెర్రి వెంగళప్ప గురించి వినే ఉంటారు. అంతకు మించిన వెర్రితో మూడు రాజధానులంటూ ఐదేళ్లు ఊరేగి.. ఇప్పుడు ఆ పిచ్చ ముదిరి మావిగన్‌గా మారడం కళ్లముందు ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య మావిగన్‌ కూడా ముదిరిపోయినట్లు కనిపిస్తోంది.

సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ అనే పదం పుట్టిన తర్వాత.. తెలుగులో ట్రోలింగ్‌ మెటీరియల్స్‌కి ఒకటి నుంచి పది వరకు ర్యాంకులు ఇస్తే.. టాప్‌ టెన్ ర్యాంకులన్నీ మావిగన్‌ మీద జరిగిన ట్రోలింగ్‌కే దక్కుతాయి. మావిగన్‌కి జనాల నుంచి వచ్చిన రియాక్షన్‌… దెందులూరు, గుంటూరు, తాడేపల్లి. దీని అర్ధం తెలిస్తే.. ఎవరికి బీపీ పెరుగుతుందో.. ఎవరు పోతారో.. జనాలకు.. ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలందరికీ తెలుసు. అందుకే మావిగన్‌ గురించి వైసీపీలో ఎవరూ నోరెత్తే సాహసం చేయరు.

అత్యంత కామెడీ పీస్‌.. మోస్ట్‌ ట్రోల్డ్‌ మెటీరియల్‌గా మారిన మావిగన్‌ పేరెత్తితే.. ఎవరైనా పగలబడి నవ్వుకొంటారు. కానీ  మావిగన్‌ పేరు చెబితే బీపీ రైజ్‌ అవుతుందని ఒక్క జగన్‌కి మాత్రమే అనిపిస్తే.. అది జనాల సమస్యో.. జగన్‌ సమస్యో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు. రివర్స్‌ గేర్‌లో స్పెషలిస్టయిన జగన్‌.. ట్రోలింగ్‌ స్టఫ్‌ని రివర్స్‌ చేసి.. మావిగన్‌ పేరు వినిపిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీపీ పెరుగుతుందని.. ఎక్కడ పోతాడో అని భయమేస్తుందని.. మీడియా ముందు నవ్వుతూ నవ్వుల పాలవడం మరో కామెడీ.

కామెడీని పక్కన పెడితే.. ప్రెస్‌మీట్‌ పెట్టిన ప్రతీసారి చంద్రబాబు చావు కోరుతూ మాట్లాడటం.. జగన్‌ మనస్తత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది. అధికారంలో ఉండగా ఈ పని చేశామని చెప్పుకోవడానికి ఏమీ లేక.. ప్రతిపక్షంలోనూ ఏమీ చేయలేక.. చంద్రబాబు ఎప్పుడు పోతాడా అన్నట్లు ఎదురు చూస్తున్న జగన్‌ ఎంత బలమైన నాయకుడో.. సామాన్య ప్రజలతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఎంత త్వరగా అర్ధం చేసుకొంటే.. వాళ్లకీ, రాష్ట్రానికీ అంత మంచిది.

Related posts

ఎస్ఐఆర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి

Satyam News

రేప్ కేసు నిందితుడైన ఆప్ ఎమ్మెల్యే పరార్

Satyam News

ఇరాన్ ను మళ్లీ రెచ్చగొడుతున్న డోనాల్డ్ ట్రంప్

Satyam News

ప్రతీకార చర్యలకు దిగుతున్న మమతా బెనర్జీ పార్టీ

Satyam News

వీధి కుక్కలపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

Satyam News

జగన్ అనుచరుడి ఉద్యోగం ఊడింది

Satyam News

Leave a Comment