తూర్పుగోదావరిహోమ్

పాత్రికేయులు కొండేపూడి మృతి

#JournalistKondepudi

అమలాపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు, విశాలాంధ్ర స్టాప్ రిపోర్టర్  కొండేపూడి సత్యనారాయణ(ఆంధ్రభూమి సత్యనారాయణ ) ఈరోజు ఉదయం ముమ్మిడివరంలోని ఆయన స్వగృహంలో అనారోగ్యంతో మృతి చెందారు. దాదాపు 40 సంవత్సరాలు పత్రికా రంగంలో పనిచేశారు. బిజిపి పాత్రికేయుల సమావేశం ఉందని నిన్న కూడా ఆయన ప్రెస్ గ్రూపులో మెసెజ్ పెట్టారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ పని చేస్తూనే వున్నారు. గతంలో ఆయన కు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రికవరీ అయ్యారు. షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టింది. ఇటీవల మరోసారి స్ట్రోక్ వచ్చింది. అది ఆయన గమనించలేదు. వారం రోజుల కిందట కిమ్స్ లో చేరారు. అప్పుడు డాక్టర్స్ గుర్తించారు.

అప్పటికే పల్స్ రేట్ 30 కి వచ్చింది. కష్టం అని కిమ్స్ యాజమాన్యం చెప్పారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆయన ఇంటివద్ద కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె వున్నారు. జర్నలిస్ట్ యూనియన్ లో కూడా కీలక పాత్ర పోషించిన సత్యనారాయణ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ యూనియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సభ్యునిగా వున్నారు.

Related posts

ఇరాన్ ప్రతిపాదనలను తిరస్కరించిన ట్రంప్

Satyam News

జగన్‌కి ముదిరిన మావిగన్‌ మైకం…. మందు లేదు బ్రదర్‌!

Satyam News

ఇంద్రకీలాద్రిపై ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

Satyam News

ప్రశ్నించే హక్కా? హద్దులు లేని ప్రవర్తనా?

Satyam News

బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య..!

Satyam News

మూడు పార్టీల సమన్వయంతో రాజంపేట అభివృద్ధి

Satyam News

Leave a Comment