33.9 C
Hyderabad
September 28, 2026
తూర్పుగోదావరిహోమ్

ఆసుపత్రిలో అనారోగ్యంతో ముద్రగడ…. పలకరించని జగన్…..!!

#Mudragada

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే అని మరోసారి రుజువైంది. కాపు ఉద్యమంతో 2019లో జగన్‌ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడానికి కారణమైన ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు.

పది రోజుల నుంచి వెంటిలేటర్‌ మీదున్న ముద్రగడను పరామర్శించాలన్న ఆలోచన కూడా జగన్‌కు రాలేదు. 2024లో పిఠాపురం నుంచి పవన్‌ కళ్యాణ్‌ గెలిస్తే పేరు మార్చుకొంటానని ఛాలెంజ్‌ చేసిన ముద్రగడ.. జనసేనాని విజయంతో.. తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.

జగన్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌తో.. కూటమి పార్టీలతో పోరాటం చేసిన ముద్రగడ.. ఈ రోజు ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. జగన్‌ కాదు కదా.. కనీసం వైసీపీ కాపు నేతలు కూడా ఆయన్ని చూడటానికి వెళ్లలేదు. ముద్రగడ వెంటిలేటర్‌ మీద ప్రాణాల కోసం పోరాడుతుంటే.. జగన్‌ అండ్‌ కో.. విజయవాడ రౌడీ షీటర్ సాయికృష్ణకు మద్దతుగా ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తూ.. కుల రాజకీయాలు చేయడం విషాదకరం.

హత్య కేసులో నిందితులు.. మద్యం స్కామ్‌లో అరెస్ట్ అయిన వాళ్లు.. గంజాయి బ్యాచ్‌.. బెట్టింగ్‌ ముఠాలు.. రౌడీ షీటర్లను పరామర్శించడానికి ఉత్సాహం చూపించే జగన్‌.. ఆయన కోసం పేరు కూడా మార్చుకున్న తన తండ్రిని పరామర్శించే తీరిక లేదా అని ముద్రగడ కుమార్తె క్రాంతి ప్రశ్నిస్తున్నారు. అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గుర్తుంటారా.. అవసరం తీరితే పట్టించుకోరా అంటూ సోషల్ మీడియా వేదికగా జగన్‌ని నిలదీశారు.

ఏరు దాటే వరకు ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్లు వ్యవహరించడం.. జగన్‌కి కొత్తేమీ కాదు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలకు ఆపద వస్తే.. ఆదుకొన్న సందర్భం ఒక్కటీ లేదని వైసీపీ వాళ్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ జైల్లో ఉండగా పార్టీని నిలబెట్టి, నడిపించిన సొంత తల్లి, చెల్లిని కూడా అవసరం తీరాక దూరం పెట్టిన జగన్‌ మనస్తత్వాన్ని గుర్తు చేసుకొంటున్నారు. అవసరం లేకపోతే వైసీపీ అధినేత కంటికి కూడా కనిపించడని ముద్రగడ పద్మనాభం పరిస్థితి చూశాక ప్రతి ఒక్కరికీ మరోసారి క్లారిటీ వచ్చింది.

Related posts

పీ ఓ కే లో ఉగ్రరూపం దాల్చిన నిరసనలు

Satyam News

పేరుకే ఆసుపత్రి… వైద్యుడు ఉండడు

Satyam News

అమెరికాలో వీసా మోసం: భారతీయుడి దేశ బహిష్కరణ

Satyam News

అంబులెన్స్ లో మంటలు: నవజాత శిశువు సజీవ దహనం

Satyam News

నీట్ గా లీక్ చేసిన లెక్చరర్లు: మరొకరు అరెస్టు

Satyam News

రొట్టెల పండగకు తొలిరోజు భక్తుల రద్దీ

Satyam News

Leave a Comment