ఖమ్మంహోమ్

ఏరువాక పున్నమి సందర్భంగా తుమ్మల శుభాకాంక్షలు

#TummalaNageswararao

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఏరువాక పున్నమి సందర్భంగా రాష్ట్ర రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పొలం దున్నే నాగలికి, నాగలి పట్టే రైతు చేతులకు వందనం చేస్తూ, వ్యవసాయమే రాష్ట్రానికి వెన్నెముక అని పేర్కొన్నారు.

మట్టిని నమ్ముకుని వ్యవసాయం చేస్తున్న రైతులకు కొండంత భరోసా కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుందని, ఒకేసారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసి రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించామని తెలిపారు.

రైతు భరోసా పథకం కింద ఎకరానికి అందించే ఆర్థిక సాయాన్ని రూ.6 వేల వరకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుత పంట సీజన్‌కు సంబంధించిన నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో నేరుగా జమ అవుతాయని తెలిపారు.

గత పంట సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయని పంటలను కూడా తెలంగాణ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.

ఈ పంట సీజన్‌లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించిన మంత్రి, రైతులు తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

పైర్లు పచ్చగా పెరిగి, పంటలు సమృద్ధిగా పండాలని, రైతుల జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని కోరుతూ ఏరువాక పున్నమి శుభాకాంక్షలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Related posts

ఓటర్ల జాబితా సవరణ పకడ్బందీగా నిర్వహించాలి

Satyam News

నారా లోకేష్ ప్రత్యేకత…. పాజిటివ్ పాలిటిక్స్!

Satyam News

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News

కారు పార్టీ స్మగ్లింగ్ లగ్జరీ కార్ల మీద నడుస్తోందా?

Satyam News

శ్రీరంగాపూర్ ఎస్సై బాధ్యత చేపట్టిన హిమబిందు

Satyam News

శ్రీవారి భక్తుడితో దురుసుగా ప్రవర్తించిన టాక్సీ డ్రైవర్‌పై చర్యలు

Satyam News

Leave a Comment