31.8 C
Hyderabad
September 27, 2026
క్రీడలుహోమ్

నేషనల్ ఛాంపియన్ షిప్ కు తెలంగాణ వాటర్ పోలో జట్టు

#WaterPolo

తెలంగాణ రాష్ట్ర సీనియర్  వాటర్ పోలో జట్టు సీనియర్  నేషనల్స్ పోటీలకు సిద్ధమైంది. తెలంగాణ వాటర్ పోలో టీం 2026 జులై 7 నుంచి జులై  12 వరకు చెన్నై కట్ట న్ కుళత్తూర్ డాక్టర్ టి.  పారివేందర్ ఆక్వాటిక్  కాంప్లెక్స్ లో   నిర్వహించనున్న 79వ సీనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్ లో పాల్గొంటారు. తెలంగాణ  రాష్ట్ర వాటర్ పోలో జట్టుకు,  మేనేజర్ అండ్ కోచ్ లకు శుక్రవారం  గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియంలో యూనిఫామ్,  టీషీర్ట్స్ కిట్ అందించారు.

ఈ ఈవెంట్ కిట్ ని  7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ స్పాన్సర్  చేసింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ  సీనియర్ నేషనల్స్ వాటర్ పోలో టీమ్ , స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు  పి . చంద్ర శేఖర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి  జి . ఉమేష్ , 7సీస్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ ఎండీ ఎల్. ఎం శంకర్ , టీం మేనేజర్ టి కిరణ్ కుమార్ , ఐ బాల మల్లేశ్వర్, వాటర్ పోలో  కోచ్ తిరుపతి , ఆయుష్ యాదవ్, బాలాజీ  పాల్గొన్నారు. సీనియర్ నేషనల్స్ వాటర్ పోలో  జట్టు ఎంపిక ట్రయల్స్ అంబర్‌పేట్‌ లోని జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన 11వ తెలంగాణ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ ఛాంపియన్‌ షిప్ లో  నిర్వహించారు.

Related posts

భార్య విగ్రహంతో పాటు తన విగ్రహాన్ని ఆవిష్కరించిన 89 ఏళ్ల రైతు

Satyam News

విడాకుల పిటిషన్ ఉపసంహరించుకున్న సంగీత

Satyam News

సూర్య క్షేత్రంలో రథసప్తమి సందడికి సిద్ధం

Satyam News

పహల్గామ్ ఉగ్రదాడి హఫీజ్ సయీద్‌ చేయించిందే…

Satyam News

Telangana Weather: తెలంగాణలో పెరగనున్న ఉష్ణోగ్రతలు

Satyam News

అవసరం లో ఉన్న వైసీపీ కార్యకర్త ను ఆదుకున్న మంత్రి లోకేష్

Satyam News

Leave a Comment