కరీంనగర్హోమ్

సింగరేణి కార్మికుల హక్కుల సాధనకు 20న నిరాహార దీక్ష

సింగరేణి కార్మికుల న్యాయమైన హక్కుల సాధన కోసం జూలై 20వ తేదీన రామగుండంలో కుటుంబ సభ్యులతో కలిసి ‘వంటావార్పు – మహా నిరాహార దీక్ష’ చేపట్టనున్నట్లు హెచ్ఎంఎస్ (HMS), తెలంగాణ రక్షణ సేన నాయకులు ప్రకటించారు. కల్వకుంట్ల కవిత నాయకత్వంలో ఇటీవల చేపట్టిన ‘బాయి బాట’ కార్యక్రమం 100% విజయవంతమైందని వారు తెలిపారు.

ప్రధాన డిమాండ్లు:

మెడికల్ బోర్డ్ కొనసాగింపు మరియు మారుపేర్ల (అలియాస్ నేమ్స్) సమస్యల తక్షణ పరిష్కారం.

టెన్త్ పాస్ కాలేదనే సాకుతో ఆపిన వారసత్వ ఉద్యోగాల మంజూరు.

‘ఓన్ యువర్ హౌస్’ కింద హౌసింగ్ బోర్డ్ సొసైటీ ఏర్పాటు మరియు పారదర్శక ప్రమోషన్ పాలసీ అమలు.

కార్మికుల పక్షాన నిలబడాల్సిన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు యాజమాన్యానికి, అధికార పార్టీకి బ్రోకర్లుగా మారారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. ప్రధాన సమస్యలను పక్కనపెట్టి, 40 డిమాండ్లతో వారు నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

ప్రైవేట్ వేలంపాటను అడ్డుకుని, తమ నిరంతర పోరాటం వల్లే ‘తాడిచెర్ల-2’ ప్రాజెక్టు సింగరేణికే దక్కేలా చేశామని గుర్తుచేశారు.

సింగరేణి యాజమాన్యానికి మరో 7 రోజుల సమయం మాత్రమే ఉందని, 20వ తేదీ లోపు మెడికల్ బోర్డుపై అధికారిక ప్రకటన చేయకపోతే కవితక్క నాయకత్వంలో కార్మికులంతా ప్రత్యక్ష పోరాటానికి (హంగర్ స్ట్రైక్) దిగి యాజమాన్యం మెడలు వంచుతామని నాయకులు హెచ్చరించారు. ఫేస్బుక్ లో ప్రేక్షకపాత్ర వహించకుండా కార్మికులంతా రామగుండం చేరుకుని దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Related posts

క్లర్క్, లేడీ కానిస్టేబుల్ రాసలీలలు..!

Satyam News

గోవా గవర్నర్ అశోక్ నర్మగర్భ వ్యాఖ్యలు

Satyam News

పీపీపీ మోడల్ పై జగన్ కు ఎందుకు అంత కక్ష?

Satyam News

ఎలక్ట్రీషియన్ ఘాతుకం: భార్యను చంపి…

Satyam News

దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకి బిగిస్తున్న ఉచ్చు…..!!

Satyam News

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

Leave a Comment