26.7 C
Hyderabad
September 20, 2026
ఆధ్యాత్మికంహోమ్

శ్రీరంగం నుండి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పణ

#TTD

ఆణివార ఆస్థానం పర్వదినం సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం శ్రీ రంగ‌నాథ‌స్వామి తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం పక్కన గల తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్‌స్వామి మఠంలో శ్రీవారి సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అక్కడినుండి తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్‌స్వామి, టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శ్రీ రమేష్, కమిషనర్ శ్రీ వినయ్ లు కలిసి పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, తమిళనాడు దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రవిచంద్ర, శ్రీరంగం ఆలయ ఈవో  శివ‌రామ్ కుమార్‌, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు సుంద‌ర బ‌ట్ట‌ర్‌ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కేంద్ర మంత్రి పెమ్మసానికి ఢిల్లీలో కీలక బాధ్యతలు

Satyam News

అల్‌ ఫలాహ్‌ యూనివర్సిటీ నిధులపై ఈడీ దర్యాప్తు

Satyam News

రూ. 2 కోట్ల విలువైన 400 కిలోల గంజాయి స్వాధీనం

Satyam News

చంద్రబాబు..  ది టార్చ్‌బేరర్‌.. నాడు మైక్రోసాఫ్ట్‌…నేడు గూగుల్‌!

Satyam News

పులివెందులలో వార్‌ వన్‌ సైడ్‌… జగన్‌ అభ్యర్ధికి డిపాజిట్‌ గల్లంతు…!!

Satyam News

విజయనగరం లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

Satyam News

Leave a Comment