క్రీడలుహోమ్

టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా

#TeamIndia

టీ20 ప్రపంచ కప్ సాధించిన టీమిండియాకు Board of Control for Cricket in India (BCCI) భారీ నగదు బహుమతిని ప్రకటించింది. ICC Men’s T20 World Cup 2026లో విజేతగా నిలిచిన సందర్భంగా రూ.131 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ టోర్నమెంట్ ఫైనల్లో న్యూజీలాండ్ జట్టు ను ఓడించి టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయాన్ని సాధించింది.

అహ్మదాబాద్ లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో టీమ్ ఇండియా ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత్ మరో చరిత్ర సృష్టించింది. టి20 ప్రపంచకప్ చరిత్రలో టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ నిలిచింది. అంతేకాదు, ఈ ఫార్మాట్‌లో మూడుసార్లు టి20 ప్రపంచకప్ గెలిచిన తొలి జట్టుగా కూడా భారత జట్టు రికార్డు సృష్టించింది.

ఈ ఘన విజయానికి కారణమైన ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది మరియు సెలెక్టర్లకు BCCI ప్రత్యేకంగా అభినందనలు తెలిపింది. భవిష్యత్తులో కూడా భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని బోర్డు ఆకాంక్షించింది. టీమ్ ఇండియా సాధించిన ఈ విజయం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో అపార ఆనందాన్ని నింపింది. భారత్ క్రికెట్ చరిత్రలో ఇది మరో మైలురాయిగా నిలిచింది.

Related posts

తప్పిపోయిన బాలికను 2 గంటల్లో గుర్తించిన తిరుపతి పోలీసులు

Satyam News

నీట్ విద్యార్ధుల కోసం రైతులు రావాలి: కాక్రోచ్

Satyam News

ముంబైలో సామూహిక హత్యలకు భారీ కుట్ర?

Satyam News

జగన్ ముందు అమరావతి పెట్టిన మరో పరీక్ష

Satyam News

అసమానతలను రూపుమాపి రాజ్యాంగ విలువలను కాపాడాలి

Satyam News

మహిళా డాక్టర్ కు లైంగిక వేధింపులు: ఆత్మహత్య

Satyam News

Leave a Comment