ముఖ్యంశాలుహోమ్

ఇరాన్‌పై అమెరికా యుద్ధం ఆపాలి: వామపక్ష నేతలు

విశాఖలోని అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన వామపక్షాల సదస్సులో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె . వి . సత్యనారాయణమూర్తి , సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు కె .లోకానతం మాట్లాడుతూ ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడులను ఖండించారు. అమెరికా యుద్ధ విధానాల వల్ల భారత్‌పై ఆర్థిక భారం పడుతోందని, కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశ ప్రయోజనాలకు విరుద్ధమని విమర్శించారు.

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ప్రజలపై భారాలు అధికమవుతున్నాయని, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. ఇరాన్‌పై యుద్ధాన్ని నిలిపివేయాలని, శాంతి పునరుద్ధరణకు ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నెల 9న విశాఖ ఆర్‌టీసీ కాంప్లెక్స్‌లోని గురజాడ విగ్రహం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో భారీ రాస్తారోకో నిర్వహించనున్నట్లు నేతలు ప్రకటించారు. సదస్సులో వివిధ వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Related posts

అమరావతికి కేంద్రం వరాలు: సెంట్రల్ సెక్రటేరియేట్ నిర్మాణం

Satyam News

యువత గొంతు నొక్కితే బీజేపీ రాజకీయ పతనం తప్పదు

Satyam News

గ్రామీణ వ్య‌వ‌స్థ బ‌లోపేత‌మే విబి జి రామ్‌జి ప‌థ‌క లక్ష్యం

Satyam News

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

Satyam News

కెనడాలో భారతీయ మహిళ దారుణ హత్య

Satyam News

ఇరుముడితో తిరుమల తిరుపతి యాత్రకు

Satyam News

Leave a Comment