ప్రత్యేకంహోమ్

దేశానికే లీడర్‌..పెట్టుబడుల్లో ఏపీ అగ్రస్థానం..!!

#CBNDubai

కూటమి పాలనలో ఏపీలో పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఏ రేంజ్‌లో అంటే.. దేశంలో ఇంకే రాష్ట్రానికి అందనంత భారీ స్థాయిలో.. సాధారణంగా ఇన్వెస్ట్‌మెంట్స్‌ లెక్కల్లో మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు టాప్‌లో ఉంటాయి. కానీ ఈ ఆర్ధిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో ఏపీ నెంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే 25.3 శాతం ఇన్వెస్ట్‌మెంట్స్‌ వచ్చాయి. 13.1 శాతంతో ఒడిశా రెండో స్థానంలో నిలువగా.. 12.8 శాతంతో మహారాష్ట్ర మూడో స్థానానికి పరిమితం అయింది.

ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, మహారాష్ట్ర.. ఈ మూడు రాష్ట్రాల్లో దేశం మొత్తం పెట్టబడుల్లో సగానికి పైగా అంటే 51.3 శాతం వాటాను సొంతం చేసుకొన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా విడుదల చేసిన ఈ రిపోర్టుని చూశాక.. ఆంధ్రప్రదేశ్‌ ఇరుగు, పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం లేదు.. అందరినీ ఓవర్‌టేక్‌ చేసి దూసుకుపోతోందని స్పష్టం చేస్తున్నారు ఏపీ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్‌. పాలనపరమైన సంస్కరణలు.. విధాన నిర్ణయాల్లో వేగం.. అనిశ్చితికి తావు లేకుండా.. పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన కమిట్‌మెంట్‌తోనే ఈ విజయం సాధ్యమైందని వివరించారు మంత్రి లోకేశ్‌. ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ గవర్నెన్స్.. సెక్టార్‌ ఫోకస్‌ పాలసీలు.. పోర్టులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు, లాజిస్టిక్స్‌, ఎనర్జీ, డిజిటల్‌ రంగాల్లో బలమైన మౌళిక సదుపాయల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో దేశీయ పరిశ్రమలతో పాటు ఇంర్నేషనల్‌ ఇండస్ట్రీస్‌ కూడా రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.

స్కేల్‌, కనెక్టివిటీతో పాటు దీర్ఘకాలిక స్థిరమైన విధానాలు కోరకొనే మల్టీ నేషనల్‌ కంపెనీలకు.. భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ గమ్యస్థానంగా మారిందని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నివేదిక తెలియజేస్తోంది. ప్రతి పెట్టుబడి ప్రకటన.. ఫ్యాక్టరీలుగా, ఉద్యోగాలుగా క్షేత్రస్థాయిలో ప్రతిబింబించాలనే లక్ష్యంతో పని చేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఇప్పటికే ప్రకటించిన పెట్టబడులతో ఆంధ్రప్రదేశ్‌.. భారత దేశ మలి విడత పారిశ్రామిక అభివృద్ధిలో డ్రైవింగ్‌ సీట్లోకి వచ్చింది. అంటే ఇకపై ఏపీ అభివృద్ధి దేశాన్నే ప్రగతి పథంలో నడిపించబోతోందన్న మాట. సంస్కరణలతో కూడిన పాలన.. పోటీతత్వం.. ఇండస్ట్రియల్‌ గ్రోత్‌కి ఇప్పుడు ఏపీ మోడల్‌ దేశానికే ఆదర్శంగా.. ఒక బెంచ్‌మార్క్‌లా మారింది.

Related posts

వైమానిక సంస్థను ప్రారంభించిన మంత్రి నారా లోకేష్‌

Satyam News

విజయనగరం లో మోడీ ఫ్లెక్సీ తొలగింపు

Satyam News

నయనతార కు భర్త అంటే ఎంత ప్రేమో

Satyam News

ఎన్ని విమర్శలు వచ్చినా మూసి ప్రక్షాళన ఆగదు

Satyam News

ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

Satyam News

బిల్ గేట్స్ పర్యటన కోసం అంతా సిద్ధం

Satyam News

Leave a Comment