హైదరాబాద్హోమ్

దేశంలో అతిపెద్ద ఎక్స్‌పోగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’

#SanjaiJajuIAS

తెలంగాణను జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా నిలబెట్టే లక్ష్యంతో నిర్వహించనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ను దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎక్స్‌పోగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు ఏర్పాట్లపై గురువారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలను సదస్సుకు ఆహ్వానించామని, ఇప్పటికే పెద్ద సంఖ్యలో సంస్థలు పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయని వెల్లడించారు. తొలుత అంచనా వేసిన దానికంటే ఈ కార్యక్రమానికి అధిక స్పందన లభిస్తోందని తెలిపారు.

ప్రత్యేక ఆకర్షణగా రక్షా ఎక్స్‌పో, స్టార్టప్ పెవిలియన్

సమ్మిట్‌లో భాగంగా రక్షా ఎక్స్‌పో, స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, తెలంగాణ పెవిలియన్, ఇండస్ట్రియల్ ఎక్స్‌పో, తెలంగాణ క్లైమేట్ కాన్‌క్లేవ్, ఎడ్యుకేషన్ సమ్మిట్, ఏరోబాటిక్ అండ్ ఎయిర్ షో వంటి పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. ముఖ్యంగా స్టార్టప్ పెవిలియన్, క్రియేషన్ కార్నర్ ద్వారా జెన్ జెడ్ యువత తమ సృజనాత్మకత, వినూత్న ఆలోచనలు, ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం, పారిశ్రామిక అవకాశాలు, మౌలిక సదుపాయాల బలాన్ని జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పరిచయం చేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశమని సీఎస్ పేర్కొన్నారు. ‘రైజింగ్ తెలంగాణ’ విజన్‌లో పెట్టుబడిదారులను భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.

సదస్సుపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్, న్యూఢిల్లీలో ఇప్పటికే కర్టెన్ రైజర్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించారు. సదస్సులో పాల్గొనే ప్రతినిధుల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు. మూడు రోజుల అంతర్జాతీయ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఏర్పాట్లను వేగవంతం చేయాలని సీఎస్ సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు.

Related posts

తోపుడు బండ్ల వ్యాపారుల నుండి అక్రమ వసూళ్లు

Satyam News

పాకిస్తాన్ భూభాగమంతా బ్రహ్మోస్‌ పరిధిలోనే…

Satyam News

పాకిస్తాన్ నుంచి యథేచ్ఛగా తుపాకుల స్మగ్లింగ్

Satyam News

కాక్రోచ్ లకు హిట్ కొడుతున్న మోడీ

Satyam News

పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే జూలకంటి

Satyam News

హిందూ సంప్రదాయాలను అవమానిస్తే కఠిన చర్యలు

Satyam News

Leave a Comment