హైదరాబాద్హోమ్

చంద్రబాబు కారు తో దిక్కుమాలిన రాజకీయం

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం ప్రధాన పార్టీలు అన్ని దారులను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఈ క్రమంలో, బీఆర్ఎస్ పార్టీ దిక్కుమాలిన రాజకీయానికి తెరతీసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోను తమ ప్రచారానికి ఉపయోగించడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు సరైన తీర్పు సమయం అని బీఆర్ఎస్ అంటుండగా, గ్రేటర్ ఎన్నికలకు ఇక్కడి నుంచే గెలుపు బాట వేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే ఆఘమేఘాల మీద అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారనే మాట కూడా వినిపిస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన సోదరుడి కుమారుడు నారా రోహిత్ వివాహం కోసం హైదరాబాద్ వచ్చిన సమయంలో తన పాత కారును చూసి మురిసిపోయారు. ఆయన 1994-2004 మధ్య కాలంలో ఉపయోగించిన అంబాసిడర్ కారు (నెం: 393) ప్రస్తుతం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉంది. రాష్ట్రమంతటా పర్యటించిన ఈ కారులోనే ప్రయాణిస్తున్నప్పుడు అలిపిరి బ్లాస్ట్ నుంచి చంద్రబాబు క్షేమంగా బయటపడ్డారు.

పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు, ఆ పాత కారును చూసి, “విత్ మై ఓల్డ్ ఫ్రెండ్” (నా పాత స్నేహితుడితో) అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ ఫోటోలను బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. టీడీపీ భాగస్వామిగా ఉన్న బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ, బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు ‘కారు’ (బీఆర్ఎస్ గుర్తు) కు మద్దతు ఇచ్చారని, కారు గుర్తుకు ఓటు వేయాలని పరోక్షంగా చెప్పారని తెగ ప్రచారం చేసుకుంటున్నారు.

సోషల్ మీడియాతో పాటు, చంద్రబాబు కారుతో ఉన్న ఫోటోలను పోస్టర్లుగా వేసి ప్రచారం చేస్తున్నారు.
‘ఓల్డ్ ఫ్రెండ్’ అంటే కేసీఆర్ అని, గతంలో చంద్రబాబు కేబినెట్‌లో కేసీఆర్ పని చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గులాబీ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆంధ్ర ఆడపడుచు అని, ఆమె భర్త మాగంటి గోపీనాథ్ గతంలో (2014లో) టీడీపీ తరఫున గెలిచారనే విషయాన్ని కూడా ఓటర్లకు గుర్తు చేస్తున్నారు.

మొత్తానికి, చంద్రబాబు పోస్ట్ చేసిన ఒక్క ఫోటో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పెద్ద రాజకీయ దుమారాన్ని రేపుతోంది.

Related posts

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

రెండో విడత ల్యాండ్ పూలింగ్ కు చర్యలు ప్రారంభం

Satyam News

పేదల తిరుపతి ఆలయ పునర్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన

Satyam News

ఎల్నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఎక్స్ పర్ట్ కమిటీ

Satyam News

ఉత్తరాంధ్ర భారీవర్షాలపై జిల్లా కలెక్టర్లకు సీఎం ఆదేశం

Satyam News

బీ ఆర్ ఎస్ పై ప్రజల విశ్వాసానికి గుర్తు ఇది

Satyam News

Leave a Comment