రంగారెడ్డిహోమ్

కార్యకర్త కుటుంబానికి అండగా నిలచిన ముఖ్యమంత్రి

#Revanthreddy

రంగారెడ్డి జిల్లా, తలకొండపల్లి మండలం, గట్టుప్పలపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఎదుల శంకర్ (శ్రీకాంత్)గారు మిడ్జిల్ బహిరంగ సభలో అస్వస్థతకు గురై దురదృష్టవశాత్తు తర్వాతి రోజు మృతి చెందారు. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి రాగానే కార్యకర్త కుటుంబానికి పార్టీకి అండగా నిలవాలని వారి కుటుంబాన్ని కలిసి ధైర్యాన్ని ఇవ్వాలని మంత్రి పొంగులేటి కి సూచించారు.

వనపర్తి జిల్లా పర్యటన ముగించుకుని వస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, శంకర్ (శ్రీకాంత్) స్వగ్రామం అయిన గట్టుప్పలపల్లి గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి, శంకర్ (శ్రీకాంత్)చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడానికి తక్షణ సాయంగా రూ. 5 లక్షల చెక్కును కుటుంబసభ్యలకు అందించారు.

భవిష్యత్ లో ఆ కుటుంబానికి కావాల్సిన ఏ విషయంలోనైనా, అన్నివేళల అండగా ఉండేలా కాంగ్రెస్ పార్టీ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటుదని, మంత్రులు కుటుంబసభ్యలకు మనో ధైర్యాన్నిచ్చారు.

ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, శంకర్ (శ్రీకాంత్) అభిమానులు మరియు గ్రామ ప్రజలందరు బాధాతప్తహృదయంతో పాల్గొన్నారు.

Related posts

తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ కొత్త కార్యవర్గం

Satyam News

విలక్షణ  దర్శకుడు డాక్టర్ పి సి ఆదిత్య కు వందేమాతరం అవార్డు

Satyam News

కాకినాడ ప్రాంతంలో ముమ్మరంగా సహాయక చర్యలు

Satyam News

నాసా కు గుడ్ బై చెప్పిన సునీతా విలియమ్స్

Satyam News

పంజాబ్ కాంగ్రెస్‌కు కొత్త అధ్యక్షుడి ఎంపిక నేడు

Satyam News

ఘనంగా శ్రీ శేషదాసుల ఆరాధన రథోత్సవం

Satyam News

Leave a Comment