అనంతపురంహోమ్

రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ సహాయం

రెండేళ్లలోని 650 మందికి ఆరున్నర కోట్ల రూపాయల మేర సీఎంఆర్ఎఫ్ కింద మేము సాయం చేస్తే.. గత వైసిపి హయాంలో కనీసం కోటి రూపాయలు కూడా ఇవ్వలేదని.. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అనంతపురం అర్బన్ టిడిపి కార్యాలయంలో ఆయన ఇవాళ సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

మొత్తం 18 మందికి 11 లక్షల 30 వేల రూపాయల కు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని అన్నారు. ఓవైపు ప్రజల ఆరోగ్యంతో పాటు సంక్షేమం, అభివృద్ధి సమపాలెంలో ముందుకు తీసుకెళుతున్నారన్నారు.

గత ఐదేళ్లలో జగన్ రెడ్డి 10 లక్షల కోట్లు అప్పులు పెట్టి పోతే.. కేవలం ఏడాదిలోని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పింఛన్లు కూడా అందిస్తున్నారని చెప్పారు. ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చొరవతో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షలు ఉద్యోగాలు వచ్చాయని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు…

Related posts

రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ భరోసా

Satyam News

ఉపాధి హామీ పథకం లో మొక్కల పెంపకం

Satyam News

అజేయ కల్లం రియల్ దందా..అన్నవరంలో భూ దోపిడీ!

Satyam News

TGIIC స్పోర్ట్స్ మీట్ లో చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

Satyam News

ఖొమైనీ హత్యకు ప్రతీకారం మా బాధ్యత

Satyam News

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

Satyam News

Leave a Comment