చిత్తూరుహోమ్

బ్రేకింగ్ న్యూస్: లడ్డు కల్తీ వ్యవహారంలో కీలకపరిణామం

#Dharmareddy

తిరుమల తిరుపతి దేవస్థానంకు లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యి కల్తీకి సంబంధించిన కేసులో దర్యాప్తు అధికారులకు శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర దోవ చూపించాడు. అప్పటిలో కీలక పాత్ర పోషించిన అప్పటి టీటీడీ ఈవో ఏ వి ధర్మారెడ్డి కేసులో అప్రూవర్ గా మారిపోయాడు.

ధర్మారెడ్డి తనపై ఉన్న నిందలను కొంతమేర అంగీకరించడం, సహకారంగా వ్యవహరించకుంటే పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేవని పశ్చాత్తాపం వ్యక్తం చేయడం వంటి అంశాలు కూడా మీడియా ద్వారా వెల్లడయ్యాయి. వివరాల్లోకి వెళితే, మూడు కీలక విషయాలు ఉన్నాయి:

నెయ్యి సరఫరా వ్యవహారంలో మాజీ EO ధర్మారెడ్డి ఇతర అధికారులతో సంప్రదింపులు జరిపినట్టు విచారణలలో తేలింది.

నెయ్యి సరఫరా వ్యవహారంలో “కల్తీ నెయ్యి” అనే ఆరోపణలు రావడంతో ధర్మారెడ్డి తన బాధ్యతను అంగీకరించి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.

ముందుగా తప్పుగా ప్రకటించిన నెయ్యి సరఫరా సరియైనదని మనస్ఫూర్తిగా తెలుసుకున్నట్లు ధర్మారెడ్డి తన స్టేట్‌మెంటులో పేర్కొన్నారు.

TTDకి సరఫరా చేసిన నెయ్యి వ్యవహారంలో 2019 నుంచి 2024 వరకు మొత్తం సుమారు 68 లక్షల కిలోగ్రాముల నెయ్యి సరఫరా చేయబడినట్లు సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) కనిపెట్టింది.

ఆ వ్యవహారంలో నెయ్యి పేరుతో కొన్ని కంపెనీల వారు కుమ్మక్కై సరఫరా చేసిన పదార్థాల్లో నెయ్యి లేకపోవడం, అసలు సదరు కంపెనీలు పాల సేకరణే జరపకపోవడం, ఇతర రసాయనాలు కలిపి నెయ్యి వంటి రంగు, రుచి, వాసన వచ్చే విధంగా తయారు చేసిన పదార్ధాన్ని సరఫరా చేయడం నిర్ధారణ అయ్యాయి. అలాగే, ధర్మారెడ్డి ఈవోగా ఉంటున్న సమయంలో ఈ నెయ్యి సరఫరా ఒప్పందాలు జరిగాయి.

ఈ వ్యవహారం వలన దైవప్రసాదం రూపంలో అందే ప్రసాదాలపై ఉన్న హిందువుల సెంటిమెంటును దెబ్బతీశారు.ఈ కేసుకు సంబంధించిన సుమారు 9 గంటల పాటు అధికారులు ధర్మారెడ్డిని విచారించారు. ఇతర అధికారులు, డైరెక్టర్లను కూడా విచారణ జరిపారు. TTD మాజీ చైర్మన్ వై వీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఈ కీలక దశలో ధర్మారెడ్డి ఎప్రూవర్ గా మారిపోయాడు.

Related posts

భారీ వరద కూడా తట్టుకుని నిలబడ్డ పోచారం

Satyam News

నాడు CBI వద్దు..నేడు ముద్దు..సునీత పోరాటం గుర్తులేదా!

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

Satyam News

భూపతి చంద్ర స్మారక కథానికల పోటీ

Satyam News

మన బడి పిలుస్తోంది..మనబడి గెలుస్తోంది

Satyam News

పెన్సిల్వేనియాలో కాల్పులు: ఒకరి హత్య

Satyam News

Leave a Comment