26.3 C
Hyderabad
September 19, 2026
విశాఖపట్నంహోమ్

పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక త్యాగంతోనే రాష్ట్రానికి రాజకీయ స్థిరత్వం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేడు స్థిరత్వం , విశ్వసనీయత, మన్నికైన పాలన దిశగా అడుగులు వేయడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యూహాత్మక త్యాగమే ప్రధాన కారణమని జనసేన నేత సందీప్ పంచకర్ల పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశను చూపాయని ఆయన కొనియాడారు. రాజకీయాల్లో సాధారణంగా పదవులు, స్వప్రయోజనాల కోసమే నాయకులు పాకులాడుతుంటారని, కానీ పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా రాష్ట్ర విస్తృత రాజకీయ స్థిరత్వం కోసం తన వ్యక్తిగత ప్రయోజనాలను పక్కన పెట్టారని తెలిపారు.

చీలిపోని ఓట్లే రాష్ట్రానికి బలమైన ప్రభుత్వాన్ని ఇచ్చాయి. ఈ స్థిరత్వం వెనుక పవన్ కళ్యాణ్ ముందుచూపు ఉంది. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే వెనక్కి తగ్గరు. ఆయన నిజాయితీని, నిబద్ధతను ఎన్నడూ సందేహించవద్దు.

నేడు రాష్ట్రం సాధించుకున్న ఈ గెలుపు తాత్కాలికం కాదు ఇది రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది. నిజాయితీని సందేహించవద్దు. పవన్ కళ్యాణ్ నిజాయితీ అచంచలమైనది. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక కోట్ల మంది ప్రజల భవిష్యత్తు దాగి ఉంది.

ఆయన వ్యూహాత్మక త్యాగం వల్లే నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది,” అని సందీప్ పంచకర్ల స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకత్వం చూపిస్తున్న ఈ నిబద్ధతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని, జనసేనాని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

Related posts

రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ఉపేక్షించేది లేదు

Satyam News

డ్రగ్స్, మానవ అక్రమ రవాణ నిరోధంలో ఎస్ఎస్ బి సేవలు భేష్

Satyam News

విశాఖకు ఏఐ పవర్.. గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో ఏపీ

Satyam News

తాడేపల్లిగూడెం లో డైమండ్ షో రూమ్ ప్రారంభం

Satyam News

ఎర్రగుంట్లలో రూ.2.52 కోట్లు పట్టివేత

Satyam News

అనంతపురం యాపిల్స్‌.. . షిమ్లాకి పోటీగా సీమ రేగిపండ్లు

Satyam News

Leave a Comment