విజయనగరంహోమ్

గంజాయి విక్ర‌యిస్తే ఏన్డీపీఎస్ చ‌ట్టం మేర‌కు జైలు

#VijayanagaramCI

గంజాయి విక్ర‌యించినా, గంజాయితో ప‌ట్టుబ‌డినా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలు కు పంపుతామ‌ని విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు శనివారం హెచ్చ‌రించారు. ఈ మేర‌కు రూర‌ల్ కార్యాల‌యంలోనే గంట్యాడ‌, విజ‌య‌న‌గ‌రం ఎస్ఐల‌తో స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. స్టేష‌న్ ప‌రిదిలో న‌మోదైన గంజాయి, మాద‌క ద్ర‌వ్యాల కేసుల న‌మోదు, విచార‌ణ‌,కోర్ట్ కేసుల‌పై సీఐ లక్ష్మ‌ణ్ రావు వివ‌రాలు తెలుసుకున్నారు.

అలాగే స్టేష‌న్ ప‌రిధిలో పోక్సో కేసులలో నిందితుల‌ను శిక్ష‌లు పడేలా చార్జ్ షీట్ రూపోందించాల‌ని సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు సూచించారు.ఈ సంద‌ర్బంగా సీఐ మాట్లాడుతూ గంజాయి పై ఎస్పీ ఆదేశాల‌తో  అక్రమ ర‌వాణ‌తో పాటు దాన్ని స‌ర‌ఫ‌రా చేస్తున్న‌వారిపైనే కూడా శాఖ దృష్టి  పెట్టింద‌న్నారు. బొబ్బిలి ప‌రిధిలోనే గంజాయి అఫెండ‌ర్స్ ను ప‌ట్టుకున్న సంగ‌తి సీఐ తెలిపారు.

గంజాయి అక్రమంగా ర‌వాణ చేసిన‌,విక్ర‌యించినా,దానితో ప‌ట్ట ఉపేక్షించేది లేద‌న్నారు. ఇటీవ‌ల సారిపాక‌లోనే 45 కేజీల గంజాయి తో ప‌ట్ట‌బ‌డ్డ వారిని ఎన్డీపీఎస్ చ‌ట్టం కింద అరెస్ట్ చేసి కోర్ట్ కు త‌ర‌లించిన సంగ‌తిని సీఐ ల‌క్ష్మ‌ణ్ రావు గుర్తు చేసారు.ఇక ఈవ్ టీజింగ్ ల పై కూడా పోలీస్ శాఖ ఉక్కుపాదం మొపుతోంద‌న్నారు. క‌ళాశాల‌లో  శ‌క్తి టీమ్ మప్టీల‌లో  సంచ‌రిస్తున్నాయ‌ని, డ్ర‌గ్స్, ఆక‌తాయిలను ప‌ట్టుకుంటున్నార‌ని సీఐ ల‌క్ష్మ‌ణ్  రావు తెలిపారు.

Related posts

ఏపీలో ఎలక్ట్రిక్‌ విమానాలు…..

Satyam News

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News

తల్లిపై కన్నేసి కొడుకును కిడ్నాప్ చేసిన లవర్

Satyam News

కోటకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam News

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

తిరుమల లడ్డు కల్తీలో బయటపడ్డ ‘పెద్దల’ హస్తం?

Satyam News

Leave a Comment