చిత్తూరుహోమ్

శేషాచలం అడవుల్లో అగ్ని ప్రమాదంపై సమీక్ష

#PavanKalyan

తిరుపతి సమీపంలోని శేషాచలం అటవీ ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో, బయోట్రిమ్ వెనుక భాగంలో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు.

అగ్నిమాపక సిబ్బంది మరియు అటవీ శాఖ సమన్వయంతో మంటలను అదుపులోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు అటవీ శాఖ ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, ప్రాంతంలో కొనసాగుతున్న అగ్నిమాపక చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని, అగ్నిప్రమాదానికి కారణమైన వారిపై అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (పీసీసీఎఫ్) నుంచి ఘటనపై నివేదిక కోరారు.

శేషాచలం అటవీ ప్రాంతం పర్యావరణపరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం కావడంతో, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, మంటలు పూర్తిగా ఆర్పే వరకు చర్యలు కొనసాగించాలని ఆదేశించారు.

Related posts

చిక్కుల్లో పడిపోయిన ప్రశాంత్ కిషోర్

Satyam News

జగన్‌.. నీ జే బ్రాండ్స్‌ మర్చిపోయావా..లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్‌

Satyam News

అందె మోహన్ కు చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే

Satyam News

రంజాన్ సెలవు 21వ తేది శనివారం:సిఎస్ సాయి ప్రసాద్

Satyam News

భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపినట్లు మళ్లీ చెప్పిన ట్రంప్

Satyam News

‘గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ హబ్‌’గా హైదరాబాద్

Satyam News

Leave a Comment