హైదరాబాద్హోమ్

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ

#Kavita

రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని అరికట్టటంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా ఫెయిల్ అయ్యిందంటూ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఫీజుల దోపిడీ నియంత్రణకు ఈ నెలలోనే చట్టం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య – ఫీజుల నియంత్రణ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆమె పాల్గొన్నారు.

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో అవినీతి పై ప్రభుత్వం స్పందించాలని కోరారు.  ఫీజు నియంత్రణ చట్టాన్ని తుంగలో తొక్కే కుట్రలను వెంటనే మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించాల్సిన ముఖ్యమంత్రే ప్రైవేట్ విద్య సంస్థల ప్రారంభోత్సవాలకు వెళ్తూ వారిని ఎంకరేజ్ చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రే మన విద్యాశాఖ మంత్రి కావటం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఫీజుల నియంత్రణ కోసం చట్టం తీసుకురావాలి

ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని ఎట్టి పరిస్థితుల్లో అరికట్టాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫీజు నియంత్రణ కోసం తక్షణమే చట్టం చేయాల్సిందేనని అన్నారు. ఈ ఏడాది ఒక్క రూపాయి కూడా ఫీజు పెంపు లేకుండా జీవో జారీ చేయాలన్నారు. ఫీజుల పెంపు కారణంగా తల్లితండ్రులకు మే నెల పీడకల మాదిరిగా తయారైందన్నారు.

తెలంగాణలో విద్య, వైద్యం కోసమే 60 నుంచి 70 శాతం వరకు వారి ఆదాయాన్ని ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. తమ పిల్లలను బాగా చదివించాలన్న తల్లితండ్రుల వీక్ నెస్ ను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ సంస్థలు అడ్డగోలుగా ఫీజులు పెంచుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రైవేట్ స్కూల్ లో దాదాపు 50 నుంచి 120 శాతం వరకు ఫీజులు పెంచుతున్నారని మండిపడ్డారు.

ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం తప్పదని హెచ్చరించారు. త్వరలోనే తమతో కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేస్తామని చెప్పారు. తాము కొత్తగా ఏమీ అడగటం లేదని…రేవంత్ రెడ్డి సర్కార్ గతంలో ఇచ్చిన హామీలనే అడుగుతున్నామన్నారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి

పెండింగ్ లో ఉన్న రూ. 11,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. బకాయిలు చెల్లించకపోవటంతో కాలేజ్ లు మాతపడుతున్నాయన్నారు. పైగా చాలా మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోతే అధికంగా నష్టపోయేది ఆడపిల్లలేనని కవిత ఆందోళన వ్యక్తం చేశారు.

చదువుల భారం ఎక్కువైతే కొడుకుల కంటే ముందు కూతుళ్లనే చదువు మాన్పించే పరిస్థితి వస్తుందన్నారు. ఈ విధంగా ప్రభుత్వం ఆడబిడ్డల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తుందన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్ పీఎస్) లో అడ్డగోలు అవినీతి జరుగుతోందని కవిత అన్నారు. ఈ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ భూముల్లో కొనసాగుతున్న హెచ్ పీఎస్ ఈ ఏడాది 120 శాతం ఫీజు పెంచిందని చెప్పారు. ప్రభుత్వ స్థలంలో కొనసాగే స్కూల్లోనే ఈ పరిస్థితి ఉంటే…చైతన్య, నారాయణ లాంటి స్కూళ్లలో పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఒకే వ్యక్తి గత 14 ఏళ్లుగా అదే పదవిలో కొనసాగుతూ, కొత్తగా వచ్చేవారికి అవినీతి పాఠాలు నేర్పుతున్నారన్నారు.

సత్య నాదెళ్ల వంటి పూర్వ విద్యార్థులు ఇచ్చిన విరాళాలకు సంబంధించి ఎలాంటి లెక్క పత్రం లేని పరిస్థితి ఉందన్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులైన కొందరు ఏకంగా 30 ఎకరాల క్యాంపస్ భూమిని కబ్జా చేసే పనిలో ఉన్నారన్నారు. హెచ్‌పీఎస్ పనితీరుపై సమగ్ర సమీక్ష జరిపి, తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

టెన్త్‌లో ఫ‌లించిన వంద‌రోజుల ప్ర‌ణాళిక‌

Satyam News

మెడికల్ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోండి

Satyam News

రొట్టెల పండగకు తొలిరోజు భక్తుల రద్దీ

Satyam News

బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌!

Satyam News

తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్

Satyam News

ఇండియాపై ‘టారిఫ్ వార్’ కు ట్రంప్ ఆదేశాలు

Satyam News

Leave a Comment