సినిమాహోమ్

31న విడుదలకు సిద్ధమౌతున్న “అమ్మా నాకు ఆ అబ్బాయి కావాలి”

#GSRMovieMakers

జిఎస్ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై పవన్ మహావీర్ ను హీరోగా పరిచయం చేస్తూ… ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శైలజ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విభిన్న ప్రేమకధా చిత్రం “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి”.

శివాల ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వర్షిక, సుహానా హీరోయిన్లు. సుమన్, రావు రమేష్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 31 విడుదలకు సిద్ధమవుతోంది.

నిర్మాత జి. శైలజరెడ్డి మాట్లాడుతూ… “అమ్మా… నాకు ఆ అబ్బాయి కావాలి” చిత్రం ఒకటికి రెండుసార్లు చూడాలనిపించేలా తెరకెక్కింది. అందుకు సహకరించిన సాంకేతిక నిపుణులకు, నటీనటులకు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. హీరోగా పవన్ మహావీర్ కు ఉజ్వల భవిష్యత్తు ఉందని వివిధ దశల్లో సినిమా చూసినవాళ్ళంతా చెబుతుంటే గర్వంతో మనసు ఉప్పొంగిపోతోంది. ఈనెల 31న విడుదల చేసెందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం” అని అన్నారు.

ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: కిషోర్, ఫైట్స్; నందు, కొరియోగ్రఫీ : భాను మాస్టర్ – మొయిన్ మాస్టర్, సంగీతం: సాయి కార్తీక్, ఛాయాగ్రహణం: మహేందర్.ఎం., ఎడిటర్: నందమూరి హరి, కో-డైరెక్టర్: రావుశ్రీ, నిర్మాత: జి. శైలజ రెడ్డి, స్క్రీన్ ప్లే – దర్శకత్వం: శివాల ప్రభాకర్.

Related posts

నేపాల్ వ్యాప్తంగా నిషేధాజ్ఞలు: రంగంలో సైన్యం

Satyam News

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News

పోలీసుల వేధింపులతో ఉర్దూ అకాడమీ ఉద్యోగి ఆత్మహత్య?

Satyam News

రాజకీయ పాఠశాల ప్రజాస్వామ్యానికి పునాది..

Satyam News

బాధ్యతలు స్వీకరించిన సుమలత

Satyam News

శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల పూజలు

Satyam News

Leave a Comment