ప్రపంచంహోమ్

అబూదాబీ స్వామి నారాయణ ఆలయం మూసివేత

#BAPSAbuDhabiMandir

అబూ దాబీ లోని స్వామి నారాయణ (BAPS Hindu Mandir) ఆలయాన్ని “తదుపరి ఆదేశాలు వచ్చే వరకు” తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యు భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.

ఈ ఆలయం అబూదాబీ నగరంలో ఉన్న ప్రముఖ హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. భారతీయులతో పాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చే భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇటీవల పశ్చిమ ఆసియాలో పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించినట్లు నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఆలయాన్ని BAPS స్వామినారాయణ సంస్థ నిర్వహిస్తోంది.

ఆలయం మూసివేతపై సంస్థ విడుదల చేసిన ప్రకటనలో, ప్రస్తుత భద్రతా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకునే వరకు ఆలయం ప్రజలకు అందుబాటులో ఉండదని పేర్కొన్నారు. సందర్శకుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని, పరిస్థితులు మెరుగుపడిన తర్వాత ఆలయాన్ని తిరిగి తెరవనున్నట్లు తెలిపారు.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద హిందూ దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ మందిరాన్ని ఇటీవలే ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరైన విషయం తెలిసిందే. ఆలయం ప్రారంభమైన తర్వాత ప్రతిరోజూ వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు.

ఆలయం తిరిగి ఎప్పుడు తెరిచే విషయంపై ఇప్పటివరకు స్పష్టమైన తేదీ ప్రకటించలేదు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన తర్వాత భక్తులకు సమాచారం అందిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Related posts

జన నాయకన్ ఇక విడుదల కాదా….?

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

యూ టర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

Satyam News

ప్రధాని మోడీని టార్గెట్ చేసిన జగన్

Satyam News

రోజా ఇంట్లో హెరిటేజ్ పాలు..వీడియో వైరల్‌!

Satyam News

భార్య పిల్లల్ని చితక్కొట్టినా తప్పులేదు

Satyam News

Leave a Comment