ప్రత్యేకంహోమ్

గవర్నర్ ను కలిసిన టీవీకే అధినేత విజయ్

#TVKVijaymetGovernor

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తనకు ఇవ్వాల్సిందిగా కోరుతూ టీవీకే అధినేత విజయ్ నేడు గవర్నర్ ను కోరారు. బుధవారం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ను కలసిన విజయ్ తనకు మెజారిటీ ఉన్నందున  ప్రభుత్వం ఏర్పాటు కు అనుమతించాలని కోరారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో TVK అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, పూర్తి మెజారిటీ సాధించడానికి ఇంకా 10 స్థానాలు అవసరం ఉన్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మెజారిటీ సంఖ్య 118 కాగా, TVK ఆ మార్క్‌కు చేరుకోలేకపోయింది. దీంతో తదుపరి కీలక దశగా అసెంబ్లీ ఫ్లోర్ టెస్ట్‌లో మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇదే సమయంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ఇటీవల వరకు DMK కు మద్దతుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుని TVK కు మద్దతు ప్రకటించింది. దీంతో DMK తో దీర్ఘకాల మైత్రికి తెరపడింది. అయితే కాంగ్రెస్‌కు కేవలం ఐదు స్థానాలే రావడంతో, ఈ మద్దతు ఇచ్చినా TVK ఇంకా మెజారిటీకి దూరంగానే ఉంది.

ఇక తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై స్పష్టత రావాలంటే ఇతర చిన్న పార్టీల మద్దతు కీలకం కానుంది. రాజకీయంగా ఉత్కంఠభరిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. త్వరలోనే ఫ్లోర్ టెస్ట్ ద్వారా తుది ఫలితం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Related posts

విశాఖకి టాప్ జీసీసీలు…. ఐటీ, ఫార్మాలో భారీ పెట్టుబడులు

Satyam News

విజయ్ జగన్ ఒక బొకే…. పరువు పోయిందిగా….

Satyam News

సీఎం రేవంత్ కు ఆటా ప్రతినిధుల ఆహ్వానం

Satyam News

గుజరాత్‌పై విజయం.. మూడో స్థానంలో పటిష్టంగా టైటాన్స్

Satyam News

ముగ్గురు రౌడీషీటర్లకు జిల్లా బహిష్కరణ

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

Leave a Comment