26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

గణతంత్ర పెరేడ్ లో ‘ఆపరేషన్ సిందూర్’

#OperationSindoorTablo

77వ గణతంత్ర దినోత్సవం పెరేడ్ లో ఆపరేషన్ సిందూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశం సోమవారం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. దేశ సాంస్కృతిక వైవిధ్యం, ఆర్థిక పురోగతి, సైనిక శక్తిని ప్రతిబింబించేలా రాజధాని న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్ పై నిర్వహించిన పరేడ్ దేశవిదేశాల అతిథులను ఆకట్టుకుంది.

ఈ ఏడాది పరేడ్‌లో ఆపరేషన్ సిందూర్ లో ఉపయోగించిన ఆధునిక ఆయుధ వ్యవస్థలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ వేడుకలకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యూరోపియన్ యూనియన్ నాయకులు ఒకేసారి గణతంత్ర వేడుకల్లో పాల్గొనడం భారత్ ఈయూ సంబంధాల్లో కీలక దౌత్య ఘట్టంగా నిలిచింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంప్రదాయ బగ్గీలో కర్తవ్య పథ్‌కు చేరుకుని పరేడ్‌కు సెల్యూట్ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాల అధిపతులు, విదేశీ దౌత్యవేత్తలు హాజరయ్యారు.

ఈ ఏడాది గణతంత్ర వేడుకల ప్రధాన థీమ్ ‘వందే మాతరం 150 ఏళ్లు’ కాగా, అదే సమయంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ను కూడా పరేడ్‌లో ప్రాముఖ్యంగా ప్రదర్శించారు. పరేడ్‌లో బ్రహ్మోస్, ఆకాశ్ క్షిపణి వ్యవస్థలు, సూర్యాస్త్ర యూనివర్సల్ రాకెట్ లాంచర్, అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్, టి-90 భీష్మ, నాగ్ మిస్సైల్ సిస్టమ్ (ట్రాక్డ్) Mk-2 వంటి స్వదేశీ ఆయుధాలు దేశ రక్షణ సామర్థ్యాన్ని చాటాయి.

ప్రత్యేక ఆకర్షణగా గ్లాస్ కేస్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్

ఆపరేషన్ సిందూర్ నిర్వహణను చూపేలా గ్లాస్-కేస్ ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ సెంటర్ ను కూడా ప్రదర్శించారు. మొదటిసారిగా భారత సైన్యం బ్యాటిల్ అరే ఫార్మాట్ లో పరేడ్ నిర్వహించింది. ఇందులో 61 కవలరీ రికానెసెన్స్ యూనిట్, హై మొబిలిటీ రికానెసెన్స్ వాహనాలు, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్, రుద్ర, అపాచీ AH-64E, ప్రచండ్ లైట్ కాంబాట్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి.

భారత నౌకాదళ టాబ్లో ‘స్ట్రాంగ్ నేవీ ఫర్ స్ట్రాంగ్ నేషన్’ అనే థీమ్‌తో ఆకట్టుకుంది. ఇందులో 5వ శతాబ్దానికి చెందిన నౌక నమూనా INSV కౌండిన్య, మరాఠా నౌకాదళానికి చెందిన గురబ్ క్లాస్ నౌకలు, ఆధునిక యుద్ధ నౌకలు INS విక్రాంత్, INS ఉదయగిరి ప్రదర్శించారు. భారత వైమానిక దళం తరఫున రాఫెల్, సుఖోయ్-30 MKI, మిగ్-29, జాగ్వార్ యుద్ధవిమానాలతో కూడిన అద్భుతమైన ఫ్లైపాస్ట్ జరిగింది.

మొత్తం 29 విమానాలు పాల్గొన్న ఈ వైమానిక ప్రదర్శన ప్రేక్షకులను ఉత్సాహపరిచింది. అదే విధంగా డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన హైపర్సోనిక్ గ్లైడ్ మిస్సైల్ LR-AShMను తొలిసారిగా ప్రజలకు ప్రదర్శించారు. ఇది అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉందని అధికారులు తెలిపారు.

మొత్తం 30 శకటాలు (17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు 13 కేంద్ర శాఖలు) దేశపు సంస్కృతి, అభివృద్ధిని ప్రతిబింబించాయి. చివరగా డేర్‌డెవిల్స్ మోటార్‌సైకిల్ విన్యాసాలు, వైమానిక దళ ఫ్లైపాస్ట్‌తో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా ముగిశాయి.

Related posts

చిన్నారి అదృశ్యం ఘటనపై పవన్ కళ్యాణ్ ఆరా

Satyam News

ఆగష్టు 16న స్థానిక ఆలయాల్లో గోకులాష్టమి

Satyam News

రవీంద్ర భారతిలో ఘనంగా బసవేశ్వర 893వ జయంతి

Satyam News

దుబాయ్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

Satyam News

ఏలూరు జిల్లాలో రిలయన్స్ రూ. లక్ష కోట్ల పెట్టుబడి

Satyam News

అమెరికాకు లోకేష్..పెరిగిన అంచనాలు.!

Satyam News

Leave a Comment