సంపాదకీయంహోమ్

బీ ఆర్ ఎస్ ను చెప్పి మరీ చితక్కొట్టిన రేవంత్

#Revanthreddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ పార్టీ ని మరొక్కమారు చితక్కొట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ కు ఆయన కొడుకు కేటీఆర్ కు ఊపిరి ఆడకుండా చేశారు. తెలంగాణ రాజకీయాల్లో తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు.

రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీకి ఇంకా పట్టు దొరకలేదు, ఒకరికొకరికి పడటం లేదు, ప్రజల్లో అసంతృప్తి… ఇలా ప్రచారం అంతా హుష్ కాకి అనిపించేసాడు రేవంత్ రెడ్డి! చెప్పి మరీ కొట్టడమంటే ఇదే! దమ్మున్న నేత అనిపించుకున్నాడు!

ఎన్ని సార్లు ఢిల్లీ వెళితేనేం పని అయ్యిందా బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం! ప్రభుత్వంపై అసంతృప్తి ఉండొచ్చు! అయినా నువ్వే కావాలి అంటూ మునిసిపల్ పోల్ లో రేవంత్ రెడ్డికే హారతి పట్టారు తెలంగాణ జనం!

నేనే రాజు నేనే మంత్రి అని ఒక్కరోజు ముందే ఢిల్లీలో ప్రకటించి మరీ విజయదుందుభి మోగించారు రేవంత్ రెడ్డి! రికార్డు స్థాయిలో అత్యధిక మునిసిపాలిటీలను, కార్పొరేషన్లను కాంగ్రెస్ గెలుచుకుంది! ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఎన్నికల్లో తామంతా ఒక్కటే అని చాటి చెప్పారు!

నేనే మొనగాడ్ని అని నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ప్రకటించినప్పుడు కొంచెం ఎక్కువైంది అనిపించింది! కానీ “ఎక్కువేం కాదు, అది నిజమే బాస్” అని ఇవాళ ఫలితాలతో కసిగా తేల్చేశాడు! హంగుల్లో దాదాపు చాలా వరకు అధికార పార్టీ వశం కాబోతున్నాయి!

క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి! రేవంత్ రెడ్డి సభల్లో మాట్లాడుతున్న తీరు చూసి “ఒట్టి మాటలేనా” అని ఒక్కోసారి అనిపించేది! తొక్క తీసి నార తీస్తా, పాతాళంలోకి తొక్కేస్తా అంటూ ఇంకా ఏవేవో మాట్లాడుతుంటే ఏమో అనుకున్నాను!

ఇవాళ ఎన్నికల్లో ఫలితాల రూపంలో అతను అన్నవన్నీ చేసి చూపించారు. ఎదురు పార్టీలను చాచి చావు దెబ్బకొట్టారు! అవును నువ్వే రాజు, నువ్వే మంత్రి! ఇంకే డౌటు లేదు రేవంత్ రెడ్డి!

Related posts

ఎన్నికల కేసుల నుంచి డి కే అరుణ కు విముక్తి

Satyam News

మళ్లీ మళ్లీ జగన్ క్రెడిట్‌ చోరీ….

Satyam News

ఏపీకి 3 బుల్లెట్‌ రైళ్లు…. గంటలో హైదరాబాద్‌ to విజయవాడ

Satyam News

సిఎస్ గా బాధ్యతలు స్వీకరించిన సాయి ప్రసాద్

Satyam News

బాణాసంచా తయారీ కేంద్రాలపై తనిఖీలు

Satyam News

బాల‌ల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణే క‌మిష‌న్ ప‌ర‌మావ‌ధి

Satyam News

Leave a Comment