హైదరాబాద్హోమ్

పరారీలో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి

#UdaiKrishnareddyIPS

మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కేసు నమోదు అనంతరం ఉదయ్‌కృష్ణారెడ్డి పరారీలో ఉన్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఆయనకు నోటీసులు అందజేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నప్పటికీ, హైదరాబాద్‌లో ఆయన పేర్కొన్న రెండు చిరునామాల్లోనూ ఆచూకీ లభించలేదు.

దీంతో ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తుండగా, ఉదయ్‌కృష్ణారెడ్డి ఆచూకీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

Related posts

కల్తీ మద్యం కట్టడికి “ఏపీ ఎక్సైజ్ సురక్ష” యాప్

Satyam News

దేశ భవిష్యత్తు కోసం చంద్రబాబు భారీ వ్యూహం!

Satyam News

ఆందోళన వద్దు వంటగ్యాస్ అందిస్తాం

Satyam News

గోవా పర్యాటక విధానం బాపట్లకు ఆదర్శం

Satyam News

నారా లోకేష్ పర్యవేక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్

Satyam News

సింహాచలం గిరిప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి

Satyam News

Leave a Comment