27.3 C
Hyderabad
September 17, 2026
ముఖ్యంశాలుహోమ్

4 లక్ష‌ల సంత‌కాలా…ప్రూఫ్ చూపించండి

#KondapalliSrinivas

మెడిక‌ల్ కాలేజీలను ప్రైవేటీక‌ర‌ణ అంటూ అస‌త్య ఆరోప‌ణ‌లు,అపోహ‌లు చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఏపీ రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ అన్నారు. ప్రైవేటీక‌ర‌ణ ఆపాలంటూ వైఎస్ఆర్పీపీ  కోటి సంత‌కాలంటూ విజ‌య‌న‌గ‌రంలో త‌ల‌పెట్టిన ర్యాలీలో విప‌క్ష నేత బొత్స మాట్లాడిన అంశాల‌పై ఎన్.ఆర్.ఐ శాఖ మంత్రి కొండ‌ప‌ల్లి ఖండించారు.

విజ‌య‌న‌గ‌రంలోని త‌న క్యాంప్ ఆఫీస్ లో సోమ‌వారం మీడియాతో మాట్లాడిన మంత్రి కొండ‌పల్లి…నాలుగు ల‌క్ష‌ల సంత‌కాలా అంటూ  విస్తుపోయారు. అసలు గ్రామీణ ప్రాంతాల‌ నుంచి తీసుకొచ్చిన సంత‌కాలా….! లేక వైఎస్ఆర్పీ నేత‌లు పెట్టించిన సంత‌కాలా అంటూ మంత్రి కొండ‌ప‌ల్లి సందేహం వ్య‌క్తం చేసారు.

అస్స‌లు నాలుగు ల‌క్ష‌ల మంది ప్రైవేటీక‌ర‌ణ ఆపాలంటూ సంత‌కాలు ఎలా పెడ‌తార‌ని, పీపీపీ ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నార‌న్నారు.అస్స‌లు ప్రైవేటీక‌ర‌ణ అన్న అంశంపై సందేహాలుంటే నా వ‌ద్ద‌కు రావాల‌న్నారు. దీనిపై చ‌ర్చ‌కు తాను సిద్దంగా ఉన్నాన‌ని మంత్రి కొండ‌ప‌ల్లి స‌వాల్ విసిరారు.

Related posts

ఇద్దరు అగ్ర మావోయిస్టుల లొంగుబాటు

Satyam News

బంగారం కొనొద్దని ప్రధాని చెప్పింది ఇందుకే..

Satyam News

బూతుల పర్వం వెనక ఐప్యాక్‌ స్కెచ్‌….??

Satyam News

అమరావతి పూర్తయితే లక్ష కోట్ల ఆదాయం

Satyam News

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు

Satyam News

అణు పరీక్షలకు సిద్ధమైన పాకిస్తాన్?

Satyam News

Leave a Comment