విశాఖపట్నంహోమ్

రైల్వే ట్రాక్ పై యువకుడు: ఎదురుగా రైలు…

#crime

అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఒక యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పాయకరావుపేట నాగరాజు పేట గేటు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఒక గుర్తుతెలియని యువకుడు ఆత్మహత్యే శరణ్యమంటూ పడుకున్నాడు. అదే సమయంలో ట్రాక్‌పై ఒక రైలు వస్తుండటాన్ని గమనించిన అవుట్ పోస్ట్ రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బంది తక్షణమే సదరు రైలు లోకో పైలట్‌కు సమాచారం అందించారు. దీంతో లోకో పైలట్ రైలు వేగాన్ని తగ్గించారు. మరోవైపు అక్కడ ఉన్న స్థానికులు కూడా వెంటనే స్పందించి, రైల్వే ట్రాక్‌పై పడుకున్న యువకుడిపైకి రాళ్లు విసిరి అలజడి సృష్టించారు. దాంతో భయపడిన ఆ యువకుడు పట్టాల పైనుంచి పక్కకు తప్పుకున్నాడు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తి, స్థానికుల అప్రమత్తతతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది.

Related posts

ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషిచేస్తా

Satyam News

కిలేడీ అరెస్టు: నాటకాలు షురూ

Satyam News

రేవంత్ ప్రభుత్వ పాలసీలు తుగ్లక్ పాలసీలు

Satyam News

ప్రియురాలిని కాల్చి చంపిన ఇద్దరు భార్యల మొగుడు

Satyam News

లోక్ సభ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం

Satyam News

ఏపీ సీఐఐ సమ్మిట్ తో అదిరిపోయిన గ్లోబల్ మీడియా

Satyam News

Leave a Comment