విజయనగరంహోమ్

నత్త నడకన ఈ-సాక్ష్యం కేసుల అమ‌లు

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌…ఐపీసీ ఇది పాత చట్టం. స్వాతంత్ర్యం వ‌చ్చిన ద‌గ్గ‌రుంచీ రాజ్యాంగం ప‌రంగా పోలీస్ మేన్యువల్ లోఅమ‌లులోకి వ‌చ్చిందీ ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌. మూడో ప‌ర్యాయం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ప‌గ్గాలు చేప‌ట్టాక స్వ‌తంత్రం పూర్తి స్థాయిలో రాజ్యాంగాన్ని మార్చేందుకు కంక‌ణం క‌ట్టుకుంది అధికారం బీజేపీ.

ఈ క్ర‌మంలోనే బ్రిటిష్ కాలం నాటి చ‌ట్టాల ను మార్చాల‌ని మొద‌టి సారి మోడీ ప్ర‌భుత్వం గ‌ద్దెనెక్కిన‌ప్పుడే మార్చాల‌ని అనుకుంది.కాని అప్పుడు నోట్ల ర‌ద్దు,370 యాక్ట్, ఎన్ఐఏ.ఎన్ఐసీ అమ‌లులోకి తెచ్చింది.

రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు రాజ్యాంగంలోని ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ అంటే ఐపీసీ మార్చేందుకు బిల్లు పెట్టి పార్ల‌మెంట‌రీ క‌మిటీ ఆమోదం పొంది ఎట్ట‌కేల‌కు పార్ల‌మెంట్ ఉభయ స‌భ‌ల‌లో బిల్లుకు ఆమోదం పోందింది. ఆ త‌ర్వాత 2023లో ఇండియ‌న్ పీన‌ల్ కోడ్ మార్చి దాన్ని స్థానంలో భార‌తీయ న్యాయ స‌మ్మిత‌,భార‌తీయ నాగ‌ర‌క స‌మ్మిత చ‌ట్టాల‌ను తీసుకొచ్చింది.

రెండేళ్ల క్రితం వర‌కు అంటే ఐపీఎస్ అమ‌లు ఎలా ఉందంటే ఎవ్వ‌రైనా త‌న‌కు అన్యాయం జ‌రిగిందంటూ లిఖిత పూర్వ‌క ఫిర్యాదు ఇస్తే సంబంధిత పోలీస్ స్టేష‌న్ సిబ్బంది ఎఫ్ఐఆర్ న‌మోదు చేసేవారు. కొత్త గా వ‌చ్చి బీఎన్ఎస్ఎస్ అయితే లిఖిత పూర్వ‌క ఫిర్యాదుతో పాటు ఫిర్యాదు దారుని వాంగ్మూలాన్ని వీడియో తీసి రికార్డ్ ప‌రంగా భ‌ద్ర ప‌ర‌చ‌డం దీన్ని కూడా సంబంధింత స్టేష‌న్ సిబ్బంది న‌మోదు చేయాలి.

దాన్నే పోలీస్ భాష‌లో ఈ సాక్ష్యం అంటారు.ఒక ప్ర‌దేశం నుంచీ గొడ‌వ జ‌రిగినా, ఫిర్యాదు చేసిన అవ‌న్నీ కూడా ఈ కొత్త చ‌ట్ట ప‌రంగా రికార్డ్ అయి ఉండాలి.అదీ విజువ‌ల్ ప‌రంగా దాన్ని సంబంధిత ఎస్.హెచ్.ఓ ఐటీ టీమ్ ద్వారా రికార్డ్ చేయాలి.

2023లో వ‌చ్చిన కొత్త బీఎన్ఎస్ఎస్ చ‌ట్టం ద్వారా ఎఫ్ఐఆర్ తో పాటు ఆ పిర్యాదు దారుడి నుంచీ వీడియో ద్వారా రికార్డ్ చేసి ఈ సాక్ష్యం యాప్ లో పొందుపర‌చాలి. ఏడాది వ‌ర‌కు స్టేష‌న్ ల‌లో న‌మోదువుతున్నఎఫ్ఐఆర్ ల విష‌యంలో సంబంధిత ఎస్.హెచ్.ఓలు ప్ర‌తీ కేసులో ఫిర్యాదు దారుని నుంచీ ఎఫ్ఐఆర్ లో పొందు ప‌ర‌చిన అంశాన్ని రికార్డ్ చేసి ఈ సాక్ష్యం యాప్ లో పొందు ప‌ర‌చాల్సి ఉంది.

కాని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉన్న 31 పోలీస్ స్టేష‌న్ ల‌లో విజ‌య‌న‌గ‌రం పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిది ఈ సాక్ష్యం కేసుల అమ‌లులో వెన‌క‌బ‌డింది. జిల్లాలో విజ‌య‌న‌గ‌రం,బొబ్బిలి,చీపురుప‌ల్లి ఇలా మూడు పోలీస్ స‌బ్ డివిజ‌న్‌లు ఉన్నాయి.

ఒక్క విజ‌య‌న‌గ‌రం పోలీస్ స‌బ్ డివిజ‌న్ ప‌రిధిలోనే అత్య‌ధిక పోలీస్ స్టేష‌న్ లు ఉన్నాయి. మూడు పోలీస్ స‌బ్ డివిజ‌న్ ల‌కు ఒక్కో డీఎస్పీ ఉన్న‌ప్ప‌టికీ అంత పెద్ద‌గా ఈ సాక్ష్యం కేసుల ప‌ర్య‌వేక్ష‌ణ‌ను అంత పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. ఒక్క విజ‌య‌న‌గ‌రం పోలీస్ స‌బ్ డివిజ‌న ప‌రిదిలో విజ‌య‌న‌గ‌రం టూటౌన్‌, భోగాపురం, కొత్త‌వ‌ల‌స‌, బొండ‌ప‌ల్లి, రామ‌భ‌ద్ర‌పురం పోలీస్ స్టేష‌న్ ల నుంచీ ఈ సాక్ష్యం కేసులు న‌మోదు చేయడంలో జాప్యం వ‌హించినట్టు డీసీఆర్బీ నివేదిక స్ప‌ష్టం చేస్తోంది.

ఎంచేత‌నంటే బోగాపురం పీఎస్ లో93 కేసులకు ఐడీల‌ను క్రియేట్ చేయంగా 83 పూర్తవ్వ‌గా 8 పెండింగ్ లో ఉన్నాయి.ఇక కొత్త‌వ‌ల‌స‌లో105కి గాను 103 చేయ‌గా రెండు పెండింగ్ ,బొండ‌ప‌ల్లి 47కిగాను 46 పూర్వ‌వ్వ‌గా ఒకటి పెండింగ్‌,అలాగే రామ‌భ‌ద్ర‌పురం 93కిగాను,92కాగా ఒక‌టి పెండింగ్‌,ఇక విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పోలీస్ స్టేష‌న్ లో 120 ఈ సాక్ష్యం కేసుల‌కు 119 పూర్తి చేయ‌గా ఒక‌టి పెండింగ్ లో ఉంది.

ఇటీవ‌లే స్టేష‌న్ ప‌రిదిలో ఎస్సీ,ఎస్టీ కేసు విచార‌ణ‌లో వాది,ప్ర‌తివాదిని స్టేష‌న్ కు పిలిచి మ‌రీ ఈ సాక్ష్యం కేసులో కోసం స్టేట్ మెంట్స్ ను వీడియా ద్వారా సీఐ శ్రీనివాస్ ఆదేశాల‌తో ఏఎస్ఐ అర్జున్ రికార్డ్ చేసారు.ఇక ఈ సాక్ష్యం కేసులు అమ‌లులో విజ‌య‌న‌గరం వ‌న్ టౌన లో 183 కేసుల‌కు అన్నింటికి ఈ సాక్ష్యం కేసులు క‌ట్టారు.

అలాగే విజ‌య‌న‌గ‌రం రూర‌ల్ పీఎస్ ప‌రిదిలో 48 కేసులు మాత్ర‌మే ఈ సాక్ష్యం యాప్ లో న‌మోదు చేసారు.జిల్లాలోని మొత్తం 31 పీఎస్ ప‌రిధిల‌లో ఈ సాక్ష్యం న‌మోదైన దాంట్లో కేవ‌లం 5 కేసులు మాత్రమే బూర్జ‌వ‌ల‌స పీఎస్ లో న‌మోదు అయ్యాయి. అత్యదికం కేసులు విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ 183.

70 ఏళ్ల నాటి బ్రిటిష్ కాలం నాటి బానిస‌త్వ‌పు సంకెళ్ల‌ను తెంచుకుని స్వాతంత్ర్యం సాధించుకున్న 140 కోట్ల భారత‌దేశంలో ఇన్నాళ్ల‌కు మ‌నం సొంతంగా కొత్త చట్టాల‌ను త‌యారు చేసుకుని అమ‌లు ప‌రుస్తున్నామ‌ని విజ‌య‌న‌గ‌రం టూటౌన్ సీఐ శ్రీనివాస్ అన్నారు.ఈ కొత్త బీఎన్ఎస్ఎస్ చట్టాల అమ‌లులో పార‌దర్శ‌క‌త కోసం ఫిర్యాదు దారులకు స‌త్వ‌ర న్యాయం కోసం ఈ సాక్ష్యం ద్వారా వేగం వంతం అవుతోంద‌ని విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ క్రైమ్ ఎస్ఐ సురేంద్ర నాయుడు అన్నారు.

బీఎన్ఎస్ఎస్ చట్టాల వ‌ల‌న ఫిర్యాదు దారునికి న్యాయ ప‌రంంగా ,కోర్ట్ లో చార్జ్ షీట్ త‌యారు చేయ‌డంలో మొత్తం ట్రాన్స‌ప‌రెన్స్ గా ఉంటోంద‌ని విజ‌య‌న‌గ‌రం వ‌న్ టౌన్ ఏఎస్ఐ ఐ డ‌బ్ల్యూ ఆఫీస‌ర్ మోహ‌న్ రావు అభిప్రాయ ప‌డ్డారు.ఈ సాక్ష్యం కేసుల ప‌రంగా స‌త్వర న్యాయం జ‌రుగుతోంద‌ని విజ‌య‌న‌గ‌రం పోలీస్ స‌బ్ డివిజ‌న్ ఇంచార్జ్ డీఎస్పీ గోవింద‌రావు స్ప‌ష్టం చేసారు.

Related posts

సంచలనం సృష్టిస్తున్న పాక్ సినిమా ది నెక్స్ట్ సలాహుద్దీన్

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

కూతురిపై అత్యాచారం చేసిన తండ్రికి 20 ఏళ్ల జైలు

Satyam News

ముంచుకొస్తున్న ‘మొంథా’ తుఫాన్

Satyam News

తిరుమలలో భక్తులకు ఇబ్బందులు

Satyam News

Operation Mobi Trackలో భారీగా సెల్‌ఫోన్ల రికవరీ

Satyam News

Leave a Comment