26.3 C
Hyderabad
September 19, 2026
ప్రపంచంహోమ్

జీ–20 శిఖరాగ్ర సమావేశం బాయ్ కాట్

#DonaldTrump

ఈ సంవత్సరం దక్షిణాఫ్రికాలో జరగబోయే జీ–20 శిఖరాగ్ర సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దక్షిణాఫ్రికా దేశం శ్వేతజాతి రైతుల పట్ల చూపుతున్న వైఖరిని కారణంగా చూపిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ట్రంప్ ఇప్పటికే తాను ఈ సమావేశానికి హాజరుకానని ప్రకటించారు. మొదట ఆయన స్థానంలో ఈ సమావేశానికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని ముందుగా చెప్పారు. అయితే ఇప్పుడు వాన్స్ కూడా ఈ ప్రయాణాన్ని రద్దు చేసినట్లు ఆయనకు సమీప వర్గాలు వెల్లడించాయి. “జీ–20 శిఖరాగ్ర సమావేశం దక్షిణాఫ్రికాలో జరుగుతుండటం పూర్తిగా అవమానకరం,” అని ట్రంప్ తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నారు.

ఆఫ్రికానర్లపై జరుగుతున్న దుర్వినియోగాలు, హింస, మరణాలు, వ్యవసాయ భూముల స్వాధీనం వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ట్రంప్ ప్రభుత్వం గతంలోనూ దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతి ఆఫ్రికానర్ రైతులపై దాడులను, వేధింపులను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శిస్తూ వచ్చింది. అమెరికా వార్షిక శరణార్థుల ప్రవేశ పరిమితిని 7,500 మందికి తగ్గించిన సమయంలో, ట్రంప్ ప్రభుత్వం ఆ స్థానాలలో ఎక్కువగా శ్వేతజాతి దక్షిణాఫ్రికన్లను ప్రాధాన్యంగా తీసుకుంటామని పేర్కొంది.

దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా మాట్లాడుతూ, “ఆఫ్రికానర్లపై వివక్ష, హింస జరుగుతున్నాయనే సమాచారం పూర్తిగా తప్పుడు విషయం” అని ట్రంప్‌కి స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. అయినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం దక్షిణాఫ్రికాపై విమర్శలను కొనసాగిస్తోంది. ఇటీవల మియామిలో జరిగిన ఆర్థిక ప్రసంగంలో కూడా ట్రంప్, “దక్షిణాఫ్రికాను జీ–20 నుండి బయటకు తీయాలి” అని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో, ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా జీ–20 విదేశాంగ మంత్రుల సమావేశాన్ని బహిష్కరించారు. ఆ సమావేశంలో ప్రధానంగా వైవిధ్యం, చేర్పు (ఇన్‌క్లూజన్), వాతావరణ మార్పు అంశాలపై చర్చలు జరగడం కారణంగా చెప్పారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వ విధానాలపై ట్రంప్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Related posts

జీవిత ఖైదీతో జీవిత బంధంలోకి జైలరమ్మ

Satyam News

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలి

Satyam News

జగన్ ని హిందువుగా మార్చగలవా భూమన….???

Satyam News

అక్కను వదిలేసి మరో పెళ్ళి చేసుకున్న బావ హత్య

Satyam News

వైసీపీ రాజకీయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు శాపం!

Satyam News

ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ

Satyam News

Leave a Comment