25.2 C
Hyderabad
September 20, 2026
గుంటూరుహోమ్

ఈనాడు రామారావు మాస్టారు ఇక లేరు

పల్నాడు జిల్లా నరసరావుపేట సీనియర్ జర్నలిస్ట్ ఈనాడు రామారావు మాస్టారు (86) సోమవారం రాత్రి కన్నుమూశారు. నరసరావుపేట ఎస్ ఎస్ & ఎన్ కళాశాల లైబ్రరీయన్ గా తన ప్రస్థానం ప్రారంభించిన రామారావు, ఈనాడు దినపత్రికలో 25 సంవత్సరాలు పని చేశారు.

ప్రస్తుతం వివిధ ప్రముఖ ప్రింట్, ఎలక్ట్రానిక్ పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టుల కు రామారావు గురుతుల్యులు. మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కు రామారావు అత్యంత సన్నిహితుడు. కోడెలకు చెందిన సేఫ్ కంపెనీ లో మేనేజింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు. రామారావు మాస్టర్ కు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నరసరావుపేటలో రామారావు అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. రామారావు మృతి పట్ల పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు, జర్నలిస్ట్ లు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కెవికె రామారావుకి ఘన నివాళి

కేవికే రామారావు మాస్టారు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోడెల శివరాం తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా డాక్టర్ కోడెల, రామారావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రామారావు మాస్టారు జర్నలిజం రంగంలో ఎంతో కాలం సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారని కోడెల శివరాం తెలిపారు. సమాజం పట్ల అంకితభావంతో పని చేసిన వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

సిపిఐ నాయకులు, ప్రముఖ వైద్యులు, న్యాయవాదులు, ప్రజా సంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. సిపిఐ రాష్ట్ర నాయకులు వై. చెంచయ్య, డాక్టర్ మర్రి పెద్దయ్య, న్యాయవాది సీజే. ప్రతాప్, జి. అమరలింగం, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, సిపిఐ సీనియర్ నాయకులు ఉప్పలపాటి రంగయ్య, ఎస్.కె. చిన్న జాన్ సైదా, పిడిఎఫ్ నాయకులు నల్లపాటి రామారావు, కోయ రామారావులు నివాళులర్పించారు.

Related posts

మహర్షి భగీరథ జయంతి సందర్బంగా ఘన నివాళి

Satyam News

విజయవాడ లాకప్ డెత్ పై హక్కుల సంఘం ఆగ్రహం

Satyam News

త్వరలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ?

Satyam News

మహిళల ఉచిత బస్సు ప్రయాణం ‘స్త్రీ శక్తి’కి సర్వ సిద్ధం

Satyam News

ఢిల్లీ అల్లర్ల నిందితులకు సుప్రీం కోర్టు బెయిల్

Satyam News

మే 1న శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం

Satyam News

Leave a Comment