కృష్ణహోమ్

జైలు శాఖ అధికారులతో హోం మంత్రి అనిత సమీక్ష

#AnithaVangalapudi

అమరావతి సచివాలయంలో హోం మంత్రి అనిత జైలు శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షలో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో మొత్తం 106 జైళ్లు (ఫంక్షనింగ్ & నాన్-ఫంక్షనింగ్ కలిపి) ఉండగా, అందులో 25 నాన్-ఫంక్షనింగ్ జైళ్ల వివరాలను ప్రత్యేకంగా జాబితా చేయాలని హోం మంత్రి అనిత అన్నారు.

ఉపయోగంలో లేని జైళ్లను మరమ్మతులు చేసి ఇతర జైలు కార్యకలాపాలకు వినియోగించే అవకాశాలపై నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. రాజమండ్రి , విశాఖపట్నం జైళ్లలో అధిక రద్దీ ఉన్న నేపథ్యంలో, కొన్ని నాన్-ఫంక్షనింగ్ జైళ్లను మరమ్మతులు చేసి ఖైదీలను అక్కడికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

జైళ్లలో overcrowding తగ్గించేందుకు సమగ్ర కార్యాచరణ నివేదిక సిద్ధం చేయాలన్నారు. అలాగే కొత్త జిల్లాల్లో కొత్త జిల్లా జైళ్ల స్థాపనపై ప్రతిపాదనలు ఇవ్వాలని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో ఒక జిల్లా జైలు ఏర్పాటు చేసే దిశగా ప్రణాళిక రూపొందించాలన్నారు. భీమునిపట్నం జైలు కూల్చివేతపై పూర్తి నివేదిక ఇవ్వాలని చెప్పారు.

అవసరమైతే చట్టపరమైన చర్యలు చేపట్టాలన్నారు. చింతపల్లి జైలు ప్రస్తుతం నాన్-ఫంక్షనల్‌గా ఉందని, ITDA నిధులతో పునరుద్ధరణ ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. జైళ్లతో పాటు Rehabilitation & De-addiction Centres ఏర్పాటు చేసే అవకాశాలపై నివేదిక ఇవ్వాలన్నారు.

విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భూముల కేటాయింపు అంశాన్ని పరిశీలించాలన్నారు. Prison Development Fund ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో NDPS కేసుల కోసం ప్రత్యేక MAPS కోర్టుల ఏర్పాటు అంశంపై నివేదిక ఇవ్వాలని చెప్పారు.

జైళ్లలో Psychiatric Support అందించే విధానంపై కార్యాచరణ రూపొందించాలన్నారు. ఖైదీలకు Skill Development & Training కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. పెరోల్‌పై విడుదలైన ఖైదీల పూర్తి వివరాలు సేకరించాలని,పెరోల్ ఖైదీలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు.

జైళ్లలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నియంత్రించేందుకు NLJD పరికరాలు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని, ఖైదీలు మరియు సిబ్బంది ద్వారా మొబైల్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

జైళ్లలో ఆత్మహత్యల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జైళ్లలో నుంచి వీడియోలు బయటకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. స్వల్పకాల & దీర్ఘకాల జైలు సంస్కరణలపై SOP ఆధారిత కార్యాచరణ రూపొందించాలని, జైళ్ల శాఖకు కొత్త వాహనాల అవసరంపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు.

Related posts

అమెరికా పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువకుడు మృతి

Satyam News

శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ ‘నెయ్యి’ వాస్తవమే

Satyam News

అన్యాయమైన డిమాండ్లు లేకపోతే చర్చలకు మళ్లీ సిద్ధం

Satyam News

భార్య వేధింపులు తట్టుకోలేక భర్త ఆత్మహత్య

Satyam News

ఆరోపణలు ఉన్నా ఆగదు ప్రమోషన్

Satyam News

నీరవ్ మోడీకి బ్రిటన్ కోర్టులో ఎదురుదెబ్బ

Satyam News

Leave a Comment