దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీ, సింగిల్ మాల్ట్ మద్యం బ్రాండ్ల ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. కర్ణాటకలో ఇప్పటికే కొత్త మద్యం పన్నుల విధానం అమల్లోకి రావడంతో ప్రీమియం స్కాచ్ విస్కీ, జిన్ వంటి బ్రాండ్ల గరిష్ఠ చిల్లర ధరలు గతంలోనే 20 శాతానికి పైగా తగ్గాయి. మే 11 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానం మద్యంలో ఉన్న ఆల్కహాల్ పరిమాణం ఆధారంగా పన్ను విధించే విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనికి భారత్–బ్రిటన్ వాణిజ్య ఒప్పందం ద్వారా తగ్గిన దిగుమతి సుంకం కూడా తోడవడంతో విదేశీ మద్యం బ్రాండ్ల ధరలు మరింత తగ్గే పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం, కొత్త ఒప్పందం వల్ల అదనంగా 5 నుంచి 7 శాతం వరకు ధరల తగ్గింపునకు అవకాశం ఉంది.
భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) 2026 జూలై 15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ ఒప్పందానికి ముందు బ్రిటన్ నుంచి దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై 150 శాతం ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 75 శాతానికి తగ్గించారు. రానున్న పదేళ్లలో దశలవారీగా ఈ సుంకాన్ని 40 శాతానికి తీసుకురావాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. దీంతో దిగుమతి వ్యయం తగ్గి, ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేసే అవకాశం మద్యం తయారీ సంస్థలకు ఏర్పడింది.
తగ్గిన సుంకాల లాభం వినియోగదారులకే

దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో జానీ వాకర్ బ్లాక్ లేబుల్, జేఅండ్బీ వంటి బ్రాండ్ల ధరలు కూడా తగ్గాయి. 750 మిల్లీలీటర్ల జానీ వాకర్ బ్లాక్ లేబుల్ ధర గతంలో సుమారు రూ.4,250 ఉండగా, కొన్ని మార్కెట్లలో రూ.3,800కు చేరింది. జేఅండ్బీ ధర రూ.2,300 నుంచి సుమారు రూ.1,700కు తగ్గినట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ధరలు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. రాష్ట్రాల ఎక్సైజ్ పన్నులు, స్థానిక ధరల విధానాలు, పంపిణీ ఖర్చుల ఆధారంగా ధరల్లో తేడాలు ఉంటాయి.
ఈ ఒప్పందం వల్ల స్కాచ్ విస్కీ దిగుమతిదారులతో పాటు దేశీయ మద్యం తయారీ సంస్థలకు కూడా ప్రయోజనం కలగనుంది. ముఖ్యంగా స్కాచ్ మాల్ట్‌ను దిగుమతి చేసుకుని దేశంలోనే మిశ్రమ విస్కీ తయారు చేసే సంస్థలకు ముడిసరుకు వ్యయం తగ్గే అవకాశం ఉంది. అయితే భారీ పరిమాణంలో దిగుమతి చేసుకునే స్కాచ్ విస్కీపై సుంకం తగ్గింపు వర్తింపునకు సంబంధించి ఇటీవల కొన్ని సాంకేతిక, వర్గీకరణపరమైన వివాదాలు కూడా తలెత్తాయి. వాటిని పరిష్కరించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ పరిశ్రమ ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది.