26.3 C
Hyderabad
September 19, 2026
గుంటూరుహోమ్

శాఖమూరులో పొట్టి శ్రీరాముల విగ్రహావిష్కరణ

#Chan

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల కాంస్య విగ్రహం ఇది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పి వి ఎన్ మాధవ్తో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. శాఖమూరులోని పార్క్ ప్రాంతంలో సుమారు 6.80 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

“అమరజీవి – త్యాగ శిల్పం (స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్)” పేరుతో నిర్మించిన ఈ విగ్రహం అమరావతి ప్రాంతంలో ఏర్పాటైన తొలి భారీ శిల్పంగా నిలిచింది. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం సాధన కోసం చేసిన 58 రోజుల నిరాహార దీక్షకు గుర్తుగా ఈ విగ్రహాన్ని 58 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఈ భారీ విగ్రహ నిర్మాణానికి సుమారు 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ ఉపయోగించారు. కేవలం ఆరు నెలల రికార్డు సమయంలోనే ఈ ప్రాజెక్ట్ మొదటి దశ పనులను పూర్తి చేయడం విశేషంగా నిలిచింది.

ఇక రెండో దశలో ఈ ప్రాంతాన్ని సాంస్కృతిక, చారిత్రక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు నిర్మించనున్నారు. పొట్టి శ్రీరాములు జీవిత చరిత్ర, ఆయన త్యాగ గాథలను భవిష్యత్ తరాలకు తెలియజేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు తెలిపారు.

పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ నిర్మించిన ఈ భారీ విగ్రహం అమరావతికి మరో ప్రత్యేక గుర్తింపును తీసుకువచ్చిందని కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పేర్కొన్నారు. ఈ శిల్పం రాష్ట్ర చరిత్రలో అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసే ప్రతీకగా నిలుస్తుందని వారు అన్నారు.

Related posts

చిన జీయర్‌ యూ టర్న్: వైసీపీలో డైలమా.!

Satyam News

లీక్ వీరులకు షాక్: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్లు జైలు

Satyam News

భక్తి పారవశ్యంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరుని రథోత్సవం

Satyam News

వైభవంగా సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ

Satyam News

మంగుళూరు రేవు కు చేరిన వంట గ్యాస్ షిప్

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

Leave a Comment