ఆధ్యాత్మికంహోమ్

వైభవంగా లక్ష్మీనరసింహ కళ్యాణం

తిరుపతి జిల్లా పెనగలూరు మండ లం ఈటిమాపురం గ్రామం కొండ పైన వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయం బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం నుంచి స్వామివారికి సుప్రభాతసేవ, అభిషేకము, అలంకరణ, నైవేద్యము నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన మీచ్చారు. సాయంత్రం బత్తిన వారి కుటుంబ సభ్యుల తరపున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్  బత్తిన గుండాల్రెడ్డి, జె. మహేశ్వరి దంపతుల చే స్వామివారికి అమ్మవార్లకు పట్టుపీతాంబర వస్త్రాలు, బంగారు మాంగ ళ్యాలు,ముత్యాల తలంబ్రాలు,వెండి యజ్ఞో పవేతము,వెండి సామాగ్రీ సమర్పించారు.

ఈ సందర్భముగా వారిని వేద పండితులు ఆలయ మర్యాద లతో ఘనస్వాగతం పలి కారు.ముత్యాల తలంబ్రాలను కొండూరు వీణ అజయ్ రెడ్డి దంపతులు అందజేశారు.నాయు డువారి పల్లి గ్రామ పెద్దల ఆధ్వర్యంలో  చెంచు వారు మరియు తూర్పుపల్లి గ్రామ పెద్దల ఆద్వర్యంలో కురవలు చెంచువారు తమ ఆడపడుచు ఆయినటువంటి చెంచు లక్ష్మి దేవికి ఆడపడుచు సాంగ్యము అంగరంగ వైభవముగా నిర్వహించారు.

అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణ మహో త్సవము శ్రీ బాలాజి స్వామి వేదపండితుల వేదమంత్రాలతో, మంగళ వాయిద్యాలతో ముత్యాల తలంబ్రాలతో, అనేక రకములైన పుష్పాలంకరణల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించినారు. టి.టి.డి బృందం మధుర గాయని, గాయకులచే వారిచే నిర్వహించిన అన్నమయ్య గానామృతం అలరించింది.

ఈ సందర్భంగా కోలాటాలు,సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కళ్యాణం అనంతరం స్వామివారి గరుడసేవ ఉత్సవము నిర్వహించారు.ఉత్సవ కార్యక్రమములో రేడియో విద్యాంసులతో మంగళ వాయు ద్యాలు,డ్రమ్స్,తప్పెట్లు,తుడుములు,కట్టె వరసలు తూముకుంట మస్తానయ్య నాధస్వరం, సి. జయరామయ్య ప్రముఖ నాధస్వర రేడియో ఆర్టిస్టు, యం.. దశరదయ్య, పి. పెంచలయ్య ప్రముఖ డోలు రేడియో & టివి ప్రొగ్రాం ఆర్టిస్టులచే మంగళ వాయిద్యాలు జరిపారు.

Related posts

ఇక గ్రేటర్‌ విజయవాడ… పదింతలు పెరుగుతుంది..

Satyam News

మహోజ్వలంగా వెలగనున్న బాసర శ్రీ సరస్వతీ దేవాలయం

Satyam News

విజయవాడ లో ఉగ్రవాదుల అరెస్టు

Satyam News

గ్రామ పంచాయతీలకు రూ.387 కోట్లు విడుదల

Satyam News

మరో 3 రోజులు భారీ వర్షాలు

Satyam News

ఇజ్రాయిల్‌కు భారత్ నుంచి ఆయుధాల సరఫరా?

Satyam News

Leave a Comment