సినిమాహోమ్

ప్రపంచ సినిమా పండుగలో వంతుకు అవార్డులు

ప్రపంచ సినిమా పండుగ… వేదిక సిమ్లా హిమాచల్ ప్రదేశ్… వచ్చిన ఎంట్రీలు… 11,000 పైగా… ఇచ్చిన అవార్డులు… సుమారు 300…. సిమ్లా హిమాచల్ ప్రదేశ్ వేదికగా ఇటీవల జరిగిన ప్రపంచ సినిమా అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో తెలుగులో విచిత్రం వంతు విభాగాలలో అవార్డులు గెల్చుకొని తెలుగు సినిమా సత్తా మరోసారి చూపించింది.

క్షీణించిపోతున్న మానవతా విలువల్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన దర్శక నిర్మాత డాక్టర్ రావుల మోహన్ రెడ్డి వంతులకు చిత్రానికి ఉత్తమ కథ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. వంతులు తెరపైన కనిపించే ఏకైక పాత్రలో ఎలక్షన్ దర్శకుడు నటుడు డాక్టర్ పిసి ఆదిత్య కనబరిచిన అసమాన నటనకు గాను ఉత్తమ స్క్రీన్ ప్లే ఉత్తమ నటుడుగా అవార్డుకు ఎంపిక అయ్యారు.

కన్న పిల్లల్ని నమ్మి తను కష్టపడి సంపాదించిన ఆస్తుల్ని పిల్లలకు పంచిన తర్వాత ఆ పిల్లలు తల్లిదండ్రులని తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేస్తే వాళ్లు ఎలాంటి దీనస్థితిలో బ్రతుకుతున్నారన్న వాస్తవ సంఘటనలకు రూపమే ఈ వంతులకు చిత్రం. ఈ చిత్రం చూసిన వారందరినీ ఆలోచింపజేసే విధంగా నటించిన పిసి ఆదిత్య నటన ప్రేక్షకుల గుండెల్ని తట్టి కన్నీరు పెట్టిస్తోంది.

ఇంతటి ఉదాత్తమైన లఘు చిత్రం ప్రపంచ సినిమా వేదికపై అవార్డులు పొందడం దర్శక నిర్మాతగా తన జన్మ ధన్యం అని డాక్టర్ రావుల మోహన్ రెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిసి ఆదిత్య స్పందిస్తూ తన నటనను గుర్తించి ఇప్పటికే పలు జాతీయ అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవాలలో అవార్డులు రావడం రచయితగా నటుడిగా తన బాధ్యతను మరింత పెంచాయని భవిష్యత్తులో మరిన్ని సందేశాత్మక చిత్రాలు నటిస్తానని అన్నారు.

Related posts

అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం

Satyam News

కొల్లాపూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

Satyam News

ప్రకృతి ప్రసాదించిన ఔషదాల గని కాకర

Satyam News

ఖబడ్దార్ పిన్నెల్లి పిచ్చికూతలు కూస్తే తాటతీస్తాం..!

Satyam News

విదేశీ విద్యార్థులకు ట్రంప్ భారీ షాక్

Satyam News

ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక

Satyam News

Leave a Comment