జాతీయంహోమ్

ప్రధాని మోదీకి కాంగ్రెస్ సూటి ప్రశ్నలు

#JairamRamesh

వందేమాతర గీతం అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై తీవ్రమైన ఆరోపణలు చేసిన కొద్ది సేపటికే కాంగ్రెస్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ముస్లిం లీగ్‌ను ప్రసన్నం చేసేందుకు నెహ్రూ వందే మాతరం గీతాన్ని తక్కువ చేసి చూపారన్న మోదీ వ్యాఖ్యలపై, కాంగ్రెస్ కమ్యూనికేషన్ ఇన్‌చార్జ్ జైరాం రమేష్ పదునైన ప్రశ్నలు లేవనెత్తారు.

“ నెహ్రూపై ఒక వర్గానికి అనుకూలమైన రాజకీయాలు చేశారనే ఆరోపణలు చేస్తున్నారు. అయితే ప్రధాని ‘మాస్టర్ డిస్టోరియన్’ (చరిత్ర విధ్వంసకుడు) ఒక ప్రశ్నకు సమాధానం చెప్తారా? 1940 మార్చిలో లాహోర్‌లో పాకిస్తాన్ తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తితో 1940 దశకంలో బెంగాల్‌లో కూటమి ఎవరు ఏర్పరచారు? అదే శ్యామా ప్రసాద్ ముఖర్జీ,” అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు.

అలాగే జిన్నాను 2005 జూన్‌లో కరాచీలో ప్రశంసించిన భారత నాయకుడు ఎవరు, ఆయనే అడిగారు. “అది ఎల్‌కే అడ్వాణీ. అలాగే జిన్నాను 2009లో తన పుస్తకంలో పొగిడిన నాయకుడు ఎవరు? అది జస్వంత్ సింగ్,” అని రమేష్ అన్నారు. లోకసభలో మోదీ చేసిన నెహ్రూ వ్యతిరేక వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇచ్చిన తొలి స్పందనలో ఈ ప్రశ్నలను జైరాం రమేష్ లేవనెత్తారు.

Related posts

టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ బదిలీ

Satyam News

పై వాడికి ఇవ్వాలి… చందాలు ఇవ్వండి…

Satyam News

టీడీపీలో నవశకం…. యువ దళపతిగా లోకేష్‌

Satyam News

ఏపీ సీఐఐ సమ్మిట్ తో అదిరిపోయిన గ్లోబల్ మీడియా

Satyam News

ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారానికి భారీ విరాళాలు

Satyam News

సోషల్ మీడియా నియంత్రణ సాధ్యమేనా?

Satyam News

Leave a Comment