కృష్ణహోమ్

వైసీపీ  పెయిడ్ ఆర్టికల్స్‌…. వణుకుతున్న వల్లభనేని వంశీ

#vallabhanenivamsi

మామూలుగా మీడియా వార్తలను రిపోర్ట్‌ చేస్తుంది. కానీ వైసీపీ మీడియా వార్తలను క్రియేట్‌ చేస్తుంది. లేనిది ఉన్నట్లుగా.. ఉన్నది లేనట్లుగా.. కథలు, కథనాలు వండి వార్చడంలో వైసీపీ  పెయిడ్‌ అర్టిస్టులు.. వాళ్లకు వాళ్లే పోటీ. జగన్‌కి ఎలివేషన్లు ఇచ్చి.. ఆయన ప్రత్యర్ధులను కించపరడమే తమ జీవిత పరమార్ధం అన్నట్లు పని చేయడం ఈ బ్యాచ్‌ లక్షణం.

అయితే ఈ మధ్య వైసీపీ బ్లూ మీడియా బెజవాడ బూతు బ్రదర్స్‌కి ఎలివేషన్లు వేస్తోంది. వల్లభనేని వంశీ గన్నవరంలో తోపు, తురుము అంటూ ఈ తాజా మాజీ ఎమ్మెల్యేని తెగ మోసేస్తున్నారు.  వంశీ మళ్లీ పూర్తిగా యాక్టివ్‌ అవడంతో.. నియోజకవర్గంలో వైసీపీ దూసుకుపోతోందని ప్రచారం చేస్తున్నారు. బ్లూ మీడియా ఏం చెప్పినా.. రియాల్టీలో పూర్తిగా రివర్స్‌లో ఉండటం సహజాతి సహజం.

జగన్‌ హయాంలో ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి.. నోటి దూలకు పరాకాష్ట ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి వల్లభనేని వంశీ. ఇదొక్కటేనా.. పార్టీ అధికారంలో ఉందని భూ కబ్జాలు, దౌర్జన్యాలు, దాడులు వంటి ఎన్నో అరాచకాలు చేశారు. ప్రభుత్వం మారడంతో.. గతంలో చేసిన తప్పులు వంశీని వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఆయనపై చాలా కేసులు పడ్డాయి. ఎక్కువ మాట్లాడితే మరిన్ని కేసులు మీదపడే ఛాన్స్‌ ఉంది.

అందుకే ఉన్నామా, లేమా అనేది తెలియకుండా.. సైలెంట్‌గా హైదరాబాద్‌ వెళ్లిపోయి గుట్టుగా బతుకుతున్నారు వల్లభనేని వంశీ. జగన్‌ తాడేపల్లి వీక్లీ విజిట్‌కి వచ్చినప్పుడు.. ఎయిర్‌పోర్టు తన నియోజకవర్గమైన గన్నవరంలో ఉంది కాబట్టి.. అటెండెన్స్‌ వేయించుకొంటున్నారు.

ఈ మధ్య బెంగళూరు నుంచి జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టులో దిగినప్పుడు.. వల్లభనేని వంశీతో పాటు ఇంకో నలుగురు ఐదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. ఎవరూ లేనప్పుడు ఆ వచ్చిన నలుగురే తోపులు అనుకొన్నారో ఏమో గానీ.. గన్నవరంలో వంశీ మళ్లీ పూర్తి స్థాయిలో క్రియాశీలంగా మారారని పబ్లిసిటీ ప్రారంభించింది వైసీపీ పెయిడ్‌ ఆర్టిస్ట్ బ్యాచ్‌.

సోషల్‌ మీడియాలో తనపై బ్లూ మీడియా ఇస్తున్న ఎలివేషన్లతో కూటమి ప్రభుత్వానికి మళ్లీ టార్గెట్‌ అవుతానేమోనని వంశీ ఆందోళనలో ఉన్నారట. వైసీపీ కోసం జైలుకైనా వెళ్లండి లేదా పార్టీని వదిలేయండి అనే రేంజ్‌లో తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఆర్డర్స్‌ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియక వంశీలాంటి తాజా మాజీలంతా విలవిల్లాడుతున్నారని వైసీపీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related posts

బలిజ భవన్‌ కల్యాణ మండపం ప్రారంబించిన మంత్రి నారాయణ

Satyam News

బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం

Satyam News

టీ 20 ప్రపంచ కప్ నుంచి పాకిస్థాన్ ఔట్

Satyam News

ఎస్పీ బంగ్లాలో ‘ర్యాంకుల’ రచ్చ…

Satyam News

ఫోన్‌ నెంబర్‌ పై జగన్ మోసం..షాకిచ్చే యోచనలో CBI..??

Satyam News

మోదీ, అమిత్ షాలు రాజీనామా చేయాలి

Satyam News

Leave a Comment