26.3 C
Hyderabad
September 19, 2026
ప్రత్యేకంహోమ్

జగన్‌కి ఢిల్లీ సంకేతాలు…. బెంగళూరులో ఆ నేతలతో సీక్రెట్ మీటింగ్!

#Jagan

మాజీ సీఎం జగన్‌ను భయం వెంటాడుతోందా..అంటే అవుననే సమాధానమే వస్తోంది. అవినీతి కేసులు, ఇన్వెస్టిగేన్‌ ఏజెన్సీల దూకుడుతో జగన్ పొలిటికల్ ఫ్యూచర్ ప్రమాదంలో  పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఓ వైపు లిక్కర్ స్కామ్, మరోవైపు బాబాయి వివేకా హత్య కేసు ఇప్పుడు ఫైనల్ స్టేజ్‌కు చేరుకున్నాయి. వీటికి తోడు అక్రమాస్తుల కేసులు కూడా కొలిక్కి వస్తుండడంతో జగన్‌లో టెన్షన్ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ టెన్షన్ కారణంగానే ఆయన ఏపీని వదిలి బెంగళూరు ప్యాలెస్‌కు పరిమితమయ్యారని సమాచారం.

బెంగళూరు ప్యాలెస్ వేదికగా జగన్‌ కొద్దిరోజులుగా సీక్రెట్ మీటింగ్స్ జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉంటున్న జగన్ బెంగళూరులో ఎవరిని కలుస్తున్నారు. ఎందుకు కలుస్తున్నారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

అధికారిక కార్యక్రమాలు లేకపోయినప్పటికీ..జగన్ కొంత మంది కీలక వ్యక్తులతో జగన్‌ మీటింగ్స్ చేస్తున్నారని, తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడానికి  భారీ లాబీయింగ్ నడుపుతున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ముఖ్యంగా ఢిల్లీ స్థాయిలో సంబంధాలు కలిగిన వ్యక్తుల ద్వారా జగన్ రాయబారం నడుపుతున్నట్లు టాక్. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల నుంచి  ఎలాంటి ఇబ్బంది లేకుండా, అవసరమైతే రాజకీయంగా ఎలాంటి రాజీకైనా జగన్ రెడీ అన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే ఆయన బెంగళూరు నుంచి కొన్ని రహస్య ప్రాంతాలకు వెళ్లి కీలక నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారనే వార్తలు ఇప్పుడు వైసీపీ క్యాడర్‌ను గందరగోళానికి గురి చేస్తున్నాయి. జగన్ చుట్టూ ఇప్పుడు కేసుల ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటోంది.

గతంలో ఎన్నడూ లేనంతగా జగన్‌లో భయం కనిపిస్తోందని, అందుకే ఆయన ప్రజల్లోకి రావడంలేదని, తెర వెనుక రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం. ఈ రహస్య సమావేశాలు జగన్‌కు ఎంత వరకు రిలీఫ్ ఇస్తాయనేది పక్కనపెడితే..ప్రజల్లో ఆయనకు ఉన్న కాస్త ఇమేజ్ మాత్రం మసకబారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ భవిష్యత్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా మారింది.

Related posts

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్: క్రికెటర్ల ఆస్తుల స్వాధీనం

Satyam News

ఇన్‌స్టా పెద్దాయనకు చంద్రబాబు భరోసా….. సిద్దాంతంలో ఇంటరెస్టింగ్‌ సీన్‌!

Satyam News

హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు

Satyam News

టీఆర్ఎస్ ఇక కల్వకుంట్ల కవితదే….

Satyam News

టెలికాం సేవల కోసం TRAI కొత్త యాప్ ఇదే…

Satyam News

హిజ్బుల్లా కీలక నేతను హతమార్చిన ఇజ్రాయెల్

Satyam News

Leave a Comment