26.2 C
Hyderabad
September 25, 2026
కడపహోమ్

విద్యార్థుల అభివృద్ధి కోసం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి పిల్లల చదువులు మరియు పాఠశాల అభివృద్ధి గురించి చర్చించుకోవడానికి మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ (మెగా పీటీఎం) ఎంతో ఉపయోగపడుతుందని తాసిల్దార్ దస్తగిరి అన్నారు.రాజంపేట మండలం కొత్త బోయిన పల్లి పీ.ఎం. శ్రీ. ఎస్.జె .ఎస్.ఎం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనారు.ఈ కార్యక్రమం కువిద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధానో పాధ్యాయురాలు భారతి విద్యార్థుల ప్రగతి, హాజరు, మరియు పాఠశాల మెరుగుదలపై చర్చ నిర్వహించారు.విద్యార్థుల చదువు మరియు ప్రతిభ,బడిలో పిల్లల నడవడిక, అలవాట్లు,పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం పై ప్రసంగించారు.

విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్,చిత్ర లేఖనం, బ్యాంకింగ్,ఫైనాన్స్,ఒకేషన్, ఆటో మోటివ్స్, పాల్ లాబ్స్ క్రీడా సామాగ్రిని తల్లి తండ్రులు తిలకించి అభినందించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి వ్యాఖ్యక్తగా రాజయ్య వ్యవహరించారు.

ఇంకా ఈ కార్యక్రమంలో అతిధులుగా గొట్టి ముక్కల పెంచల రావు, మేడా జానకిరాం, బోడగల చలమయ్య, పోట్టా చిన్న శంకరయ్య, శారద, ఉపాధ్యాయులు మోలక ఓబులేసు, శేషగిరి, పారా శ్రీరాము లు,శివ ప్రసాద్ గౌడ్, ఎస్.ప్రభాకర్ రావు, విజయ భాస్కర్, అనిల్, మజ్జారి చెన్న కేశవులు, సువర్ణ సుందరి, అమరావతి,మధు వాణి, ప్రణవి, దార్ల శ్రీనివాసులు ఆచారి, మేడా సాయినాథ్, ప్రశాంత్,సి.ఆర్.పి. బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాదకద్రవ్యాల వినియోగంపై భీమిలిలో ర్యాలీ

Satyam News

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Satyam News

పెన్షన్ క్లెయిమ్ ల పరిష్కారానికి చర్యలు

Satyam News

అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి:రాచాల

Satyam News

భారత క్రికెటర్ శ్రీచరణికి టీటీడీ చైర్మన్ అభినందనలు

Satyam News

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చిప్ డ్రీమ్!

Satyam News

Leave a Comment