విజయనగరంహోమ్

ఉత్తరాంధ్రకు ప్రధాని ఇచ్చిన వరాలు ఏవీ..?

ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు అని చెప్పిన కూటమి నర్కార్ చివరకు ఉత్తరాంధ్ర వానుల కలలను నాశనం చేసిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ఆరోపించారు. తమ ప్రాంతానికి మొదటి సారిగా ప్రధాని మంత్రి వస్తున్నారని, ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి తగిన దారి చూపుతారని జిల్లా వానులు భావించారని, కానీ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి మంత్రి లోకేషు ఒకరినొకరు పొగడ్తల భజన చేసుకోవడానికే నమావేశం ఏర్పాటు చేసారని ఆయన ఆరోపించారు.

కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని జిల్లా వాసులు భరించలేకపోతున్నారని అన్నారు. మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్కు వైజాగ్ పేరు పెట్టడంతోపాటు జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ నిభందనల మేరకు పెట్టామని చెప్పడం జిల్లా వానుల మనోభావాలను పూర్తిగా దెబ్బతీసేలా వున్నాయన్నారు. ఇటువంటి చర్యలను అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాలన్నారు.

ఇంతఖర్చు కేవలం మోడీ భజన కోసమేనా..!

భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం నిమిత్తం ఏర్పాటు చేసిన కార్యాక్రమాన్ని కేవలం మోడీ భజన నిమిత్తం కూటమి ప్రభుత్వం మార్చుకుందని ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేసారు. ఉత్తరాంధ్రలో అనేక సమస్యలు ఉ న్నాయని, ఒడిస్సా రాష్ట్రంతో నాగావళి-వంశధార నదుల వివాదం, కొటియా గ్రామాల వివాదాలు పరిష్కరించలేకపోతున్నారని, అలాగే జిల్లాలో అనేక ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోయాయని, కొన్ని నత్త నడకన నడుస్తున్నాయని అన్నారు.

వీటికి పరిష్కారం చూపించలేకపోయారన్నారు. ఇక విజయనగరం జిల్లాలో ఫెర్రో, జ్యూట్ పరిశ్రమలు మూత పడడంతో కార్మికులు వలన పోయారన్నారు. ఢిల్లీలో ఉత్తరాంద్ర వానులు కూలీలుగా పనిచేస్తున్నారని, ఇవిషయాన్పి గుర్తించలేదా అని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రకు ఏయిర్పోర్ట్ వలన ఏం ఒరింగిందని ప్రశ్నించారు. ప్రతీ సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రజల భవిష్యత్ను ఏదో బంగారుమయం చేసినట్లుగా గొప్పలు చెబుతున్నారని, ఏం చేసారో చెప్పగలరా అని ప్రశ్నించారు.

ఇప్పటికీ గిరిజన బిడ్డలు డోలీ మోతలలో వైద్యం కోసం వస్తున్నారని, ఈవిషయాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు గుర్తించలేకపోయారని ఎద్దేవా చేసారు. నీట్ పరీక్షల 21 మంది మరణిస్తే మాట్లాడని పవన్ కళ్యాణ్ విద్యార్థులు ఆందోళన చేసి ప్రధాని మోడీని ఏదో అన్నారని తెగ బాధపడిపోతున్నారని, ఇదంతా రాజకీయ |డ్రామాగా ఈశ్వరయ్య అభివర్ణించారు.

వెంటనే భోగాపురం ఎయిర్పోర్ట్ పేరును మార్చాలని డిమాండ్ చేసారు. ఈనమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి. కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఒమ్మిరమణ, నహాయ కార్యదర్శులు బుగత అశోక్, అలమండ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పోర్టుల అభివృద్ధిలో ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు!

Satyam News

మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

Satyam News

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణులు

Satyam News

కొత్త ఎజెండా తో ప్రజల ముందుకు కేసిఆర్

Satyam News

లేటు వయసులో ఘాటు ప్రేమ: చివరికి మర్డర్

Satyam News

అమ్మ ఒడి vs తల్లికి వందనం.. ఏ స్కీమ్‌తో ఎక్కువ లాభం?

Satyam News

Leave a Comment