వర్గపోరును సద్దుమణిగించడంలో నాయకత్వం చేతులెత్తేస్తే.. ఉన్మాదంతో వెర్రితలలేసిన పార్టీ నాయకులు కొందరు సొంతపార్టీ నేతలపైనే రపా.. రపా .. అంటూ గంగమ్మ జాతరల్లో యాట గొంతుకోసినట్లు కోస్తే అది వైసీపీ యువ నాయకుడు నవులూరి చెన్నారెడ్డి హత్య అవుతోంది..!’ మీరు చదివింది నిజమే..
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, రెంటచింతల మండలం, రెంటాల గ్రామ ప్రజల సాక్షిగా ఒక వైసీపీ నాయకుడిని, వైసీపీలోని మరో గ్రూప్ కిరాతంగా గొంతు కోసి హత్య చేశారు. వైసీపీని, పిన్నెల్లి సోదర్లును నమ్ముకున్నందుకు సీనియర్ నాయకుడు, మాజీ జెడ్పీటీసీ నవులూరి భాస్కర్ రెడ్డి కుమారుడు చెన్నారెడ్డి హత్య రాష్ట్ర వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నవులూరి భాస్కర్ రెడ్డి కుమారుడు చెన్నారెడ్డి. వైసీపీ తరఫున మాచర్ల నియోజవర్గ రాజకీయాల్లో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. దాన్ని జీర్ణించుకోలేక అదే వైఎస్సాఆర్ పార్టీకి చెందిన కొందరూ.. పోయిన గురువారం అనగా ఆగష్టు 6వ తేదీ, 2026 అర్ధరాత్రి రెంటచింతల మండల కేంద్రం నుంచి స్వగ్రామమైన రెంటాలకు వస్తుండగా మార్గ మధ్యంలో కాపు కాసి, కళ్లల్లో కారం కొట్టి.., కత్తులతో గొంతు కోసి, పంట కాలవలో పడిసే పరారు అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించగా.., భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి అక్కడికి పిన్నెల్లి సోదరులు వచ్చారు. వారిని చూసిన వైసీపీ నాయకులు, బంధువులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. చెన్నారెడ్డి హత్య వెనుక ఉన్న మాస్టర్ మైండ్ నీ సోదరరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డే అని మండి పడ్డారు. హత్యకు పథకం రచించి, మనుషులను ఉసిగొల్పి మా బిడ్డను బలితీసుకుంది నీ సోదరుడు, మీ అనుచరుడే అంటూ రామకృష్ణారెడ్డిని నిలదీశారు.
మా కుటుంబం ఏ పాపం చేసింది..? 15 సంవత్సరాలుగా మీ కుటుంబాన్ని, వైసీపీని నమ్ముకున్నంతకు ఇదా ఫలితం అంటూ తండ్రి భాస్కర్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. టాపిక్ డైవర్షన్ కోసం వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డికి రామకృష్ణారెడ్డి ఫోన్ చేసి, భాస్కర్ రెడ్డిని పరమర్శించండి అని తన ఫోన్ భాస్కర్ రెడ్డికి ఇవ్వగా.. జగన్ అసలేం జరిగిందని భాస్కర్ రెడ్డిని అడగగా, హత్య చేసింది మనోళ్లే అని కన్నీరుమున్నీరుగా విలపించాడు భాస్కర్ రెడ్డి..
మరోవైపు చెన్నారెడ్డి రాజకీయాల్లో యాక్టీవ్ గా ఉండటమే తప్పా..? అనుచరులకు అధిపత్యం ఇచ్చేందుకు.. మా బిడ్డ వారి గొంతు కోసి బలికొంటారా..? అంటూ పిన్నెల్లి సోదర్లపై వైసీపీ నేతలు, చెన్నారెడ్డి బంధువులు తిరగబడ్డారు. అంత్యక్రియలకు సైతం వస్తే ఊరుకోం అంటు కన్నెర్ర చేసి మండిపడ్డారు. హతుడి తల్లి కడుపుపై కొట్టుకుంటూ నా కొడుకు గొంతుకోసి, కడుపుకోత మిగిల్చిన వేడుకకు వచ్చారా..? అంటూ బోరున విలపించగా.., నా భర్త ఏ పాపం చేశాడు భరించలేనంత చిత్రహింసలతో కిరాతంగా చంపారు అంటూ చెన్నారెడ్డి భార్య గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు బంధువులను కంటతడిపెట్టించింది.
ఒకవైపు బంధువుల శాపనార్థలు.., మరోవైపు వైసీపీ నాయకులు చీత్కారాలు నడుమ ఎదురైన చేదు అనుభవాన్ని చూసి తట్టుకోలేక అక్కడి నుంచి పిన్నెల్లి సోదర్లు వెనుదిరిగారు. అంతిమంగా చెన్నారెడ్డి వైసీపీలో ఎదుగుతున్న క్రమాన్ని జీర్ణించుకోలేక, పాము తన పిల్లల్ని తానే మింగినట్లు.., పిన్నెల్లి వెంటరామిరెడ్డి తన ప్రదాన అనుచరులతో హత్య చేయించాడని పల్నాడు జిల్లా వైసీపీ లో చర్చ నడవడం గమనార్హం ..!
