విశాఖపట్నంహోమ్

ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ప్రభుత్వం

#ThankYouCMSir

చేసిన మంచి పనికి కృతజ్ఞత చెప్పాలనే గొప్ప సాంప్రదాయానికి ఉత్తరాంధ్ర ఉద్యోగులు తెరతీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు అన్నారు. సిపిఎస్ నుండి ఓపిఎస్ కు మారిన ఉత్తరాంధ్ర ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆదివారం విశాఖలోని స్వర్ణభారతి స్టేడియంలో కృతజ్ఞతాభివందన సభను విజయవంతంగా నిర్వహించారు.

రాష్ట్రంలో వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల కలను సాకారం చేస్తూ పాత పెన్షన్ విధానాన్ని (ఓపిఎస్) అమలు చేసినందుకు గాను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటామని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ హాజరయ్యారు.

ఎపి డిఎస్సీ ఫోరం, నోబుల్ టీచర్స్ అసోసియేషన్, పి.ఆర్.టి.యు, ఎపిటిఎఫ్ తదితర ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో తొలుత ఓపిఎస్ లబ్ది పొందిన ఉద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 15 వేల మంది ఈ సభకు హాజరయ్యారు. “థాంక్ యూ సిఎం సర్.. సముద్రమంతా ఆనందం, కుటుంబాలతో మేమందరం” అంటూ ఉద్యోగులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

శాసన మండలి ప్రభుత్వ విప్ డాక్టర్ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ, ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది కానీ కుటుంబాలకు రిటైర్మెంట్ ఉండదని పేర్కొన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి 11 వేల మంది కుటుంబాలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భద్రత కల్పించి ఆయురారోగ్యాలను పెంచిందని స్పష్టం చేశారు. 2019-24 మధ్యకాలంలో రాష్ట్రంలో చీకటి యుగం నడిచిందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు డిఏలు, మెడికల్ బిల్లులు కూడా మర్చిపోయారని గుర్తు చేశారు. గతంలో ఉపాధ్యాయుల జీతాలు చాలా తక్కువగా ఉండేవని, రెవెన్యూ ఉద్యోగులతో సమానంగా ఉపాధ్యాయుల జీతాలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని కొనియాడారు.

2004 నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొంది, సాంకేతిక కారణాల వల్ల 2004 తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు ఓపిఎస్ విధానాన్ని, ఫ్యామిలీ పెన్షన్, గ్రాట్యుటీ ఇచ్చిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుందన్నారు. సింగపూర్ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే స్థిరమైన పాలన అవసరమని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించాలంటే చంద్రబాబు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వానికి ప్రజలు స్థిరమైన పాలన అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములని, 2029 లో ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చే విధంగా ఉద్యోగులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రజల కోసం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల భాగస్వామ్యం కీలకమైనదని అన్నారు. ఉద్యోగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిపాలనలో చంద్రబాబు నాయుడుకు అపారమైన అనుభవం ఉందని, భవిష్యత్తు తరాలకు బాటలు వేయడానికి కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు అండగా నిలవాలని కోరారు. స్వర్ణాంధ్ర లక్ష్యంతోనే సీఎం పనిచేస్తున్నారని చెబుతూ, 2029 లక్ష్యంతో అందరూ ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు.

శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ, గత వైకాపా ప్రభుత్వం మద్యం దుకాణాల దగ్గర క్యూలైన్లను నియంత్రించడానికి ఉపాధ్యాయులను నియమించి వారిని అగౌరవపరిచిందని చెప్పారు. 2019 నుండి 2024 వరకు రాష్ట్రంలో దుర్మార్గ పాలన సాగిందన్నారు.

ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ, ఉద్యోగులకు మేలు చేసే ఎటువంటి కార్యక్రమానికి అయినా కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులుగా తాము ఒకే తాటిపై ఉంటూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని అన్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, కంచర్ల శ్రీకాంత్, పేరాబత్తుల రాజశేఖర్ లు మాట్లాడుతూ, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను విప్ వేపాడ చిరంజీవిరావు సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు నిరంతర కృషి జరుపుతున్నామని చెప్పారు.

పలువురు ఓపిఎస్ ఉద్యోగులు మాట్లాడుతూ, చంద్రబాబు తమకు పాత పెన్షన్ విధానంతో పునర్జన్మ ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. సభలో ఓ ఉద్యోగి ఆరేళ్ల కుమార్తె మాట్లాడుతూ, “పెన్షన్ రావడంతో మా నాన్న చాలా సంతోషంగా ఉన్నారు, రోజూ పెన్షన్ ఇస్తే బాగుండును” అని అమాయకంగా చెప్పిన మాటలతో సభాప్రాంగణం చప్పట్లతో మారుమ్రోగింది.

ఈ కార్యక్రమంలో ఉద్యోగులు అతిథులకు శాలువాలు కప్పి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా సత్కరించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఎం.శ్రీనివాసరావు, గోపినాథ్, ఆర్.అప్పలరాజు, కేఎల్ ప్రసాద్, బలగ శ్రీనివాస్, సుబ్బారెడ్డి, డాక్టర్ బి. గోవింద నాయుడు తదితరులు మాట్లాడుతూ ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వ నేతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

కొల్లేరు సరిహద్దులు మార్పుల కోసం కేంద్రానికి లేఖ

Satyam News

అమరావతి నిర్మాణంలో వైజాగ్‌ స్టీల్‌…. కూటమి ప్రభుత్వం ఉక్కు మద్దతు..!!

Satyam News

కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి నిధులు

Satyam News

దొరల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఐలమ్మ

Satyam News

అల్లుడు తో రాసలీలలు సాగిస్తూ….

Satyam News

భారత్ రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం

Satyam News

Leave a Comment