అంబర్‌పేట్‌లోని గౌడ్ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరుడు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంబర్‌పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ హాజరై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అణగారిన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన గొప్ప యోధుడని అన్నారు. ఆయన ధైర్యం, సామాజిక న్యాయం కోసం చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. గౌడ్ సంఘం సభ్యులు, నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కి ఘన నివాళులు అర్పించారు.
సత్యం న్యూస్, అంబర్పేట్
