ముఖ్యంశాలుహోమ్

రికార్డు స్థాయిలో ఒకే రోజులో 9 మంది నేరస్తుల అరెస్టు

#VizagPolice

వివిధ నేరాలకు పాల్పడి తప్పించుకు తిరుగుతున్న 9 మంది నేరస్తులను విశాఖ గాజువాక పోలీసులు రికార్డు స్థాయిలో 24 గంటల్లోనే అరెస్టు చేశారు. నేరస్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి వరుసగా అరెస్టులు చేస్తున్నామని క్రైమ్ ఏసీపీ ఏ. వెంకట్రావు తెలిపారు.

అరెస్టు చేసిన తొమ్మిది మంది నిందితుల వద్ద నుంచి రూ.51 వేల నగదుతో పాటు సుమారు రూ.86 వేల విలువైన సొత్తును రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నేరాలకు పాల్పడి తప్పించుకుని తిరుగుతున్న వారిపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, కేసుల దర్యాప్తులో భాగంగా నిందితులను గుర్తించి అరెస్టు చేస్తున్నామని క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు.

నిందితులను జిల్లా కోర్టులో హాజరుపరిచిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు కేంద్ర కారాగారానికి తరలించినట్లు గాజువాక క్రైమ్ పోలీసులు తెలిపారు. నేరస్తులపై నిఘాను మరింత ముమ్మరం చేసి, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Related posts

తిరుమల ముంతాజ్ హోటల్ భూమి పై వాస్తవాలు ఇవి

Satyam News

న్యాయమూర్తి ఎదుటకు బాల్క సుమన్

Satyam News

మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు

Satyam News

తెలంగాణ జాతిపిత రావి నారాయణ రెడ్డి

Satyam News

అమెరికాకు గట్టిగా బుద్ధి చెప్పనున్న భారత్

Satyam News

మన్యం లో పరిమళించిన మానవత్వం

Satyam News

Leave a Comment