మహబూబ్ నగర్హోమ్

ప్రజాకవి కాళోజీ యాదిలో ‘తెలంగాణ భాషా దినోత్సవం’

#KalijiNarayanarao

​ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని పెద్దదొడ్డి ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య , ఉపాధ్యాయులు చక్రధర్, నాగరాజు కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ భాష, యాసకు కాళోజీ తెచ్చిన గుర్తింపును, ఆయన రాసిన రచనలను ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. “పుటక నీది, చావు నీది, బతుకంతా దేశానిది” అంటూ కాళోజీ సమాజానికి అందించిన సందేశాన్ని గుర్తుచేశారు. మాతృభాష ప్రాముఖ్యతను కాపాడుకోవాలని, తెలంగాణ భాషా సౌందర్యాన్ని భావితరాలకు అందించాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

దీపావళి జోష్: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డు

Satyam News

కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో లోకేష్‌ భేటీ సీక్రెట్‌..?

Satyam News

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

Satyam News

నవ మల్లెతీగ మంత్లీ మ్యాగజైన్ ఆవిష్కరణ

Satyam News

ఐబీ నూతన డైరెక్టర్ గా మహేష్ దీక్షిత్

Satyam News

మహిళా సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నాం

Satyam News

Leave a Comment