ఆధ్యాత్మికంహోమ్

పుణ్య ఫలితాలు ఇచ్చే పుష్యమాసం

#jogulambatemple

చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. పుష్యఅనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం. పుష్య మాసం శీతాకాలం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యానపారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. పుష్యపౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది. ఈ మాసంలో రైతులకి పంట చేతికి వచ్చే కాలం కావున ధాన్య లక్ష్మి, ధన లక్ష్మి రూపంలో లక్ష్మీదేవిని విష్ణు మూర్తి సమేతంగా పూజిస్తారు.

ఈ మాసంలో గృహ ప్రవేశాలు, పెళ్ళిళ్ళు, శంఖుస్థాపనలు వంటి శుభకార్యాలు చేయడానికి వీలులేనప్పటికీ సాధారణ పూజలు, పెద్దలని స్మరించుకొని చేసే అన్ని పుణ్యకార్యాలకి విశేషమాసంగా చెప్పవచ్చు. పుష్య మాసానికి అధిపతి అయిన శని మరియు నక్షత్రాధిపతి అయిన గురువుని పూజించడం వలన విశేష ఫలితం లభిస్తుంది… పుష్యమాసంలో శని గ్రహానికి అమావాస్య రోజున తైలాభిషేకం నిర్వహించడం ద్వారా శని బాధ నివృత్తి జరుగుతుంది. వీటితో పాటుగా వస్త్ర దానం, తిల దానం, అన్నదానం చేయడం వలన శని దోషాలు తొలగి శుభ ఫలితాలు పొందవచ్చు. పుష్య పౌర్ణమి రోజున నదీ స్నానం చేయడం వలన సకల పాపాలు తొలగుతాయి. ఈ రోజు చేసే దానాల వలన పుణ్య ఫలితం అధికంగా ఉంటుంది అని తెలుపు తున్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వచ్చేది పుష్యమాసం లోనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించేది ఈ మాసంలోనే. సూర్యుడు ధనురాశి నుండి మకరరాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి.

Related posts

బీ ఎం ఎస్ జాతీయ అధ్యక్షుడు గా సుంకరి మల్లేశం

Satyam News

పాకిస్తాన్ పరువు తీసిన జై శంకర్

Satyam News

ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే తో వనపర్తి చిన్నారెడ్డి

Satyam News

అవుట్‌డోర్ ప్రకటన విధానం పై రాష్ట్ర హైకోర్టు స్టేటస్ కో

Satyam News

మంగళగిరిలో మరో ఎన్నికల హామీ పట్టాలపైకి…. లోకేష్ జెట్‌ స్పీడ్…!!

Satyam News

మత్తు పదార్థాల వల్ల భవిష్యత్తు అంధకారం

Satyam News

Leave a Comment