కడపహోమ్

పంజాబ్ నుంచి అద్దె గుండాలతో వైసీపీ అరాచకం

#Punjab

స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యపూరితంగా వ్యవహరించి విజయం సాధించాలని చూస్తున్న వైసీపీ గుట్టు రట్టు అయింది. రాయచోటిలో నిన్న జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. దీంతో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. వైసీపీ నాయకులు దౌర్జన్యాలు చేసేందుకు ఎంతకు తెగించారో ఈ సంఘటనతో అర్ధం చేసుకోవచ్చు. పంజాబ్ మరియు ఇతర రాష్ట్రాల వారిని వైసీపీ నేతలు అద్దెకు తెచ్చుకుంటున్నారు. రాయచోటిలో పోలీసుల తనిఖీల్లో వైసీపీ గూండాల నుండి తుపాకులు, తూటాలు స్వాధీనం చేసుకున్నారు. పది మందికి పైగా నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. వైసీపీ అభ్యర్థితో కలిసి వచ్చిన అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి ఈ రివాల్వర్‌, పిస్టల్‌, తూటాలు, ఇతర ఆయుధ సామగ్రిని, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Related posts

బడ్జెట్ ప్రభావంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Satyam News

ఘనంగా ముగిసిన జిల్లా పోలీసు వార్షిక క్రీడా సంబరాలు

Satyam News

కీసర గుట్ట పై శివ రాత్రి సందడి

Satyam News

అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకున్న సానా సతీష్

Satyam News

పాలు లేవు.. నెయ్యి లేదు… అంతా కల్తీ…

Satyam News

అంబటి ఆఫీసుకి నిప్పు పెట్టింది సొంత మనుషులే….!

Satyam News

Leave a Comment