ప్రత్యేకంహోమ్

‘సర్’ పై సమాధానమిచ్చేందుకు పది రోజుల గడువు

#SupremeCourtOfIndia

కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్ పై సమాధానం ఇచ్చేందుకు పిటీషనర్లకు పది రోజుల గడువు ఇస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ అఫిడవిట్ కు సమాధానాలు ఇచ్చేందుకు ఇప్పుడు పిటీషనర్లకు పది రోజుల గడువును సుప్రీంకోర్టు ఇచ్చింది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ చేపట్టింది. బీహార్‌లో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సందర్భంగా సుప్రీంకోర్టు అనుమతి లేకుండానే ఓటరు నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో మార్పులు చేశారంటూ రాజ్యసభ సభ్యురాలు దోలా సేన్ దాఖలు చేసిన తాజా పిటిషన్‌పై ఎన్నికల సంఘానికి, ఇతర ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

సర్ ప్రక్రియను సమర్థిస్తూ భారత ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌పై సమాధానం ఇచ్చేందుకు పిటిషనర్లకు సుప్రీంకోర్టు మంగళవారం పది రోజుల గడువు ఇచ్చింది. ఈ ప్రక్రియ చట్టబద్ధమైనదేనని, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో పేర్కొంది.

ఫారం 6 పై ఎన్నికల సంఘం తప్పుడు సమాచారం

పిటీషనర్ తరఫున సీనియర్ న్యాయవాది, ఎంపీ మేనకా గురుస్వామి వాదనలు వినిపిస్తూ, ఫారం-6లో చేసిన మార్పులకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపిందంటూ ఎన్నికల సంఘం తప్పుగా పేర్కొన్నదని ఆరోపించారు. ఈ వాదనల నేపథ్యంలో అన్ని అంశాలను పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. తొలి పిటిషనర్ రాకేశ్ కుమార్ సింగ్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్‌ను, ఎన్నికల సంఘం సోమవారం రాత్రి దాఖలు చేసిన సమాధాన అఫిడవిట్‌పై పది రోజుల్లోగా ప్రతివాద అఫిడవిట్ సమర్పించాలని ఆదేశించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌తో పాటు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లకు సమాధానంగా ఎన్నికల సంఘం 248 పేజీల అఫిడవిట్‌ను సమర్పించింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను ఈ అఫిడవిట్‌లో గట్టిగా సమర్థించింది. ఫారం-6లో మార్పులు చేశారన్న ఆరోపణలను తోసిపుచ్చింది. ఓటరు నమోదుకు చట్టబద్ధంగా ఉపయోగించే ఫారం-6లో ఎలాంటి మార్పులూ చేయలేదని స్పష్టం చేసింది.

ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై గత పది నెలల్లో ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి కనీసం 14 సార్లు అంతర్గతంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారని సెప్టెంబర్ 25న ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన కథనం ఈ వివాదానికి కారణమైంది. తమకు తెలియకుండా లేదా తమ సిఫారసులు లేకుండానే కొన్ని నిర్ణయాలు, ఉత్తర్వులు జారీ అయ్యాయని వారు అభ్యంతరం తెలిపినట్లు ఆ కథనం పేర్కొంది.

ఎన్నికల సంఘంపై అనవసర ఆరోపణలు చేయడం విచారకరమని ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఎన్నికల సంఘం తరఫున ఉప ఎన్నికల కమిషనర్ భాను ప్రకాశ్ యెతురు ఈ అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఈ సమాధాన అఫిడవిట్‌ను కూడా ఎన్నికల సంఘంలోని ముగ్గురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతే దాఖలు చేసినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్, కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ చట్టబద్ధత, ఫారం-6లో మార్పుల ఆరోపణలు, ఎన్నికల సంఘం నిర్ణయాలపై వ్యక్తమైన అభ్యంతరాలన్నింటినీ సుప్రీంకోర్టు పరిశీలించనుంది.

Related posts

బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్ర కన్నుమూత

Satyam News

లోకేష్ సంస్కారానికి చాగంటి జేజేలు!

Satyam News

గ్రహణం రోజున ముస్లింల ర్యాలీ…!

Satyam News

నేడు పవిత్ర భీష్మ ఏకాదశి

Satyam News

బీసీసీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిటీ సభ్యులుగా సానా సతీష్

Satyam News

ఏఐ టెక్నాలజీతో జీఎస్టీ వ్యవస్థలో లోపాలకు అడ్డుకట్ట

Satyam News

Leave a Comment