ముఖ్యంశాలుహోమ్

పోలింగ్ అధికారి హరిత మృతిపట్ల సీఎం చంద్రబాబు విచారం

#CBNProfile

అనంతపురం జిల్లా కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తూ అస్వస్థతకు గురై పోలింగ్ అధికారి హరిత మృతి చెందడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. హరిత (58) అనంతపురం జిల్లా డి.హీరాహల్ మండలం పూలకుర్తి గ్రామంలోని ఎంపీయూపీ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్నారు.

ఎన్నికల విధుల్లో భాగంగా ఆమె కూడేరు మండలం కాడదారకుంట పోలింగ్ కేంద్రంలో విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో పోలింగ్ కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య బృందం వెంటనే ఆమెను కూడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించింది.

అక్కడ అత్యవసర వైద్య చికిత్స అందించినప్పటికీ గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు ఆమె మరణించారు. హరిత మృతి పట్ల ముఖ్యమంత్రి ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రభుత్వం ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హరిత ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Related posts

విజయవంతంగా రెండో వారంలోకి ‘పోలీస్ కంప్లైంట్’

Satyam News

మార్చి తో ముగియనున్న సి ఎస్ పదవీకాలం

Satyam News

ఎర్రజెండా పోరాటానికి కాంగ్రెస్ అండ

Satyam News

ఏపీకి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ C4IR కేంద్రం

Satyam News

భారత్ జపాన్ దేశాల మధ్య బంధం పటిష్టం

Satyam News

నరసరావుపేటలో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు

Satyam News

Leave a Comment